ఎన్టీఆర్ సినిమా కోసం మరో యువ హీరో.. పవర్ఫుల్ రోల్ కోసం త్రివిక్రమ్ హై వోల్టేజ్ ప్లాన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొంతమంది హీరోలు పాజిటివ్ నెగిటివ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను చేస్తున్నారు. పాత్రలో మ్యాటర్ ఉంటే అగ్ర హీరోలతో దెబ్బలు తినడానికి కూడా రెడీ అంటున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడికి అలాంటి హీరోలు దొరికితే బిగ్ స్క్రీన్ పై మాస్ డోస్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం కూడా ఒక హై వోల్టేజ్ కాంబోను సెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఫుల్ స్క్రిప్ట్ అయితే రెడీ
జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. RRR లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత వస్తున్న సినిమా కాబట్టి తారక్ రేంజ్ మరింత పెరిగేలా త్రివిక్రమ్ కథను రెడీ చేశాడట. ఫుల్ స్క్రిప్ట్ అయితే రేడిగానే ఉందట. అయితే దర్శకుడు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ ఫార్ములా.. మరోసారి
జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన అరవింద సమేత అనుకున్నంత రేంజ్ లో అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సారి మాత్రం త్రివిక్రమ్ పవర్ఫుల్ పాత్రలతో సినిమా కథను రెడీ చేశాడట. ప్రతి సినిమాలో హీరోకు సమానంగా ఉండేలా మరో పవర్ఫుల్ పాత్రలను క్రియేట్ చేస్తూ వస్తున్న త్రివిక్రమ్ ఈ సారి ఎన్టీఆర్ సినిమాలో మరో యువ హీరోను దింపబోతున్నట్లు సమాచారం.

అంతకంటే హై రేంజ్ లో
అరవింద సమేతలో నవీన్ చంద్ర నెగిటివ్ పాత్రలో నటించగా.. అల.. వైకుంఠపురములో సినిమాలో యువ హీరో సుశాంత్ ను సెలెక్ట్ చేసుకోవడం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అయితే అంతకంటే హై రేంజ్ లో ఉండేలా ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ యువ హీరోను లైన్ లో పెట్టినట్లు సమాచారం.

పవర్ఫుల్ పాత్రలో నవీన్
ఇక ఆ హీరో మరెవరో కాదు. నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో అద్భుతమైన నటనతో మంచి సక్సెస్ అందుకున్న నవీన్ ఇప్పుడు జాతిరత్నాలు సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యువ నటుడిని ఎన్టీఆర్ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











