»   » ‘మనం'లో అక్కినేని సూపర్ హిట్ రీమిక్స్

‘మనం'లో అక్కినేని సూపర్ హిట్ రీమిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: అక్కినేని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జు, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'మనం'. ఈ అక్కినేని ఆఖరి చిత్రం లో ఆయన సూపర్ హిట్ సాంగ్ ...ఒక లైలా కోసం తిరిగాను దేశం పాటను రీమిక్స్ చేసినట్లు తెలిసింది. అక్కినేని నటించిన రాముడు కాదు కష్ణుడు చిత్రంలోని ఈ గీతం ఆనాటి యువతను ఉర్రూతలూగించింది. అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులందరినీ మెప్పించేలా ఈ పాటకు ప్రత్యేకంగా రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.

    శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనం గురించి నిర్మాత నాగార్జున మాట్లాడుతూ..' నాన్న, నేను, చైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రం నాకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. మా బేనర్లో ఈ చిత్రం ఓ ప్రెస్టీజియర్ చిత్రం అవుతుంది' అన్నారు.

    దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...'నాగేశ్వరరావు గారు, నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ఈచిత్రాన్ని చేస్తున్నాను. ఫస్ట్ లుక్ గెటప్స్ డిఫరెంటుగా ఉన్నట్లుగానే సినిమా కూడా చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు. వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావుగారొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.

    ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    ANR’s famous songs ‘Oka Laila Kosam’ will be remixed in Manam film. Aunp Rubens has composed the music and Virkam Kumar of Ishq fame is the director. Nagarjuna, Naga Chaitanya, Samanta, Shriya Saran play lead roles in this film.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more