»   » ఫేస్ బుక్ లో.. ‌: పవన్ ని ఇలా ఆడుకుంటున్నారు(ఫొటోలు)

ఫేస్ బుక్ లో.. ‌: పవన్ ని ఇలా ఆడుకుంటున్నారు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రచారం మితిమీరుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతూండటంతో తమవంతుగా పార్టీలన్నీ ఇక్కడా ప్రచారం భారీ ఎత్తున చేస్తున్నాయి. అందులో భాగంగా సినీ నటుడు, జనసేన అధినేత, ప్రస్తుతం తెలుగుదేశం, బీజెపీ పార్టలకు ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ పై ఓ రేంజిలో పోస్ట్ లతో విరుచుకుపడుతున్నారు. ప్రశ్నించే పార్టీ కాస్తా ప్రచార పార్టీగా మారిందని అంటున్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ పోస్టులు ఉండటం ఆయన అభిమానులను భాదిస్తున్నాయి.

ఇక పవన్ మరో ప్రక్క ప్రసంగాల్లో ...తనమీద చెయ్యివేస్తే అభిమానులు చూసుకుంటారని అంటున్నారు. ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు కారణం రాజశేఖర్‌రెడ్డి కుటుంబమేనని, అయినా కేసీఆర్‌ వాళ్లని ఎప్పుడూ ఒక్కమాట అనరని, అమాయకులైన సీమాంధ్ర ప్రజలను తిడుతుంటారని పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైఎస్‌ తెలంగాణను దోచుకుంటుంటే కేసీఆర్‌ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు తనపై ఉన్న కోపం వైఎస్‌పై ఎందుకు లేదన్నారు. కేసీఆర్‌ భయపెడితే తాను బెదరనని, తనమీద చెయ్యివేస్తే అభిమానులు చూసుకుంటారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

సీమాంధ్రులంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు... అన్ని కులాలు, మతాలవారు ఇక్కడ ఉన్నారన్నారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్మోహన్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రి కావాలని ఎలా కలలు కంటున్నారని పవన్‌ ప్రశ్నించారు. జగన్‌ అధికారదాహాన్ని తప్పుపడితే తనపై సాక్షి తప్పుడు రాతలు రాస్తోందన్నారు. పదవికోసం తాను మాట్లాడడం లేదని, ప్రజల కోసమే ప్రచారం చేస్తున్నానని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Anti Pawan Fans publicity in Face book

ఎన్డీయే, తెదేపాలకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న జనసేన అధ్యక్షుడు ఎక్కడైతే దోపిడీ ఉంటుందో అక్కడ విప్లవవీరుల్లాంటి జనసేన కార్యకర్తలుంటారన్నారు. అవినీతి పరులకు కోనసీమ పౌరుషాన్ని యువతరం రుచి చూపించాలన్నారు. ప్రజా హక్కులు కాలరాస్తే తనలో ఆవేశం ఉప్పొంగుతుందన్నారు. దేశంకోసం సమాజం కోసమే తన సినిమాల్లో దేశభక్తి గీతాలని ఆయన పేర్కొన్నారు.

దేశమంటే ఇష్టమని, సమాజమంటే ప్రేమ అని పేర్కొన్న ఆయన కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి దాకా మొత్తం తిరిగానన్నారు. తెలంగాణ ప్రజలు మన అన్నదమ్ములు... రాష్ట్రం విడిపోయినా మనం కలిసేవుండాలనుకున్నానని కానీ కేసీఆర్‌ రాష్ట్రం విడిపోయినా విద్వేషం కక్కుతున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

English summary
Pawan Kalyan has been on a whirlwind tour across Seemandhra along with BJP's Prime Ministerial candidate Narendra Modi and TDP supremo Chandrababu Naidu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more