ఇన్నాళ్లకు మరో ఛాన్స్.. ఈసారైనా అమ్మడికి కలిసి వచ్చేనా..?

Recommended Video

Anu Emmanuel In Bellamkonda And Santhosh Srinivas's Next Movie

అను ఇమ్మాన్యుయేల్.. చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రకారు గుండెల్లో పాగా వేసుకుని కూర్చుంది. అందం ఉన్నా అదృష్టం కలిసి రాని ఈ భామకు సరైన హిట్ పడటం లేదు. చేసిన అన్ని సినిమాలు బెడిసికొడుతుండటంతో కనమరుగైంది. అయితే మళ్లీ ఓ బంపరాఫర్ దక్కినట్టు తెలుస్తోంది.

 ఒకే ఫ్లోలో అను కెరీర్..

ఒకే ఫ్లోలో అను కెరీర్..

నాని 'మజ్ను'తో తెలుగువారికి పరిచయమైన ఈ కేరళకుట్టి... తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అవకాశాలు వచ్చినంత త్వరగా విజయాలు మాత్రం రాలేదు. దీంతో రేసులో వెనకబడిపోయింది.

 స్టార్ హీరోల సినిమాల్లో..

స్టార్ హీరోల సినిమాల్లో..

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో ఆడిపాడే ఛాన్సెస్ రావడంతో ఈ అమ్మడి దశ తిరిగిందని ఒకానొక దశలో మిగతా భామలు కుళ్లుకునే స్టేజ్‌కు ఎదిగింది. దీంతో అందరి దృష్టి కూడా అనుపై పడింది.

బోల్తా కొట్టిన బడా ప్రాజెక్ట్స్..

బోల్తా కొట్టిన బడా ప్రాజెక్ట్స్..

అజ్ఞాతవాసి, నా పేరు సూర్య వంటి ఆ చిత్రాలతో ఎక్కడికో వెళ్ళిపోతుందని భావించారు. అయితే, అనూహ్యంగా ఆ సినిమాలు బోల్తా కొట్టాయి. పెద్ద సినిమాలు హిట్ అయితే ఎంత పేరు వస్తుందో తెలీదు కానీ.. ఫట్ అయితే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు.

 తాజాగా మరో చాన్స్..

తాజాగా మరో చాన్స్..

చివరగా వచ్చిన శైలజా రెడ్డి కూడా వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా ఈ సుందరికి మరో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చిత్రంలో రెండో నాయికగా నటించే అవకాశం దక్కించుకుందట ఈ సుందరి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న కొత్త చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందీ భామ. ఇక ఇందులో మెయిన్ లీడ్ గా ఇప్పటికే నభా నటేశ్ కన్ ఫర్మ్ అయిందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X