ఆ ఇద్దరు భామలతో రొమాన్స్.. డబుల్ డోస్‌లో మంచు విష్ణు రచ్చ

మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో 13ఏళ్ల క్రితం వచ్చిన 'ఢీ' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఢీ సినిమా అనేది అప్పట్లో ఓ సక్సెస్ ఫార్మూలా. ఢీ సినిమాను ఆధారంగా చేసుకుని అప్పట్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో దాదాపు అన్నీ కూడా హిట్లే. అయితే మళ్లీ ఇన్నేళ్లకు ఆ కాంబో సెట్ అయిన సంగతి తెలిసిందే. 'ఢీ'కి సీక్వెల్‌గా 'డి & డి''డ‌బుల్ డోస్' అంటూ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఢీ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన శ్రీహరి, జయప్రకాష్ రెడ్డి పాత్రలకు ఆల్టర్నేట్‌గా ఇంకా ఎవ్వరినీ ఫిక్స్ చేయలేదు గానీ హీరోయిన్లను మాత్రం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. విష్ణుకు జోడీగా ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్యా జైస్వాల్ నటించనున్నారని సమాచారం. ఇక ఎంతో ముఖ్యమైన ఆ రెండు క్యారెక్టర్లు ఎవరు పోషిస్తారో చూడాలి.

Anu Emmanuel Pragya jaiswal In Manchu Vishnu Double dose

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై మంచు విష్ణు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గోపీమోహ‌న్, మ‌రో పాపుల‌ర్ రైట‌ర్ కిషోర్ గోపు స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మ‌హ‌తి సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, మోహ‌న‌కృష్ణ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఇటు విష్ణు, అటు శ్రీను వైట్ల ఫాంలోకి వస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X