ఆ సినిమాలో అను ఇమ్మాన్యుల్ స్థానంలో ఇలియానా!
రవితేజ- శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్ లో వెంకి, దుబాయ్ శీను తర్వాత మళ్లీ కలిసి చేయబోతున్న చిత్రం అమర్ అక్బర్ అంథోని. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ 90 శాతం అమెరికాలో జరుగుతుంది. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ మరియు ఇతర లొకేషన్స్ లో చిత్రీకరణ చెయ్యబోతున్నారు. అత్యధిక శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనున్న మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే అవ్వడం విశేషం. రవితేజ ఈ సినిమాలో మూడు విభిన్న సేడ్స్ లో కనిపించబోతున్నాడు.
మాస్ మహారాజా రవితేజ- శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్ లో వెంకి, దుబాయ్ శీను తర్వాత మళ్లీ కలిసి చేయబోతున్న చిత్రం అమర్ అక్బర్ అంథోని. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యుఎస్ లో జరుగుతోంది.

ఈ చిత్రం షూటింగ్ 90 శాతం అమెరికాలో జరుగుతుంది. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ మరియు ఇతర లొకేషన్స్ లో చిత్రీకరణ చెయ్యబోతున్నారు. అత్యధిక శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనున్న మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే అవ్వడం విశేషం. రవితేజ ఈ సినిమాలో మూడు విభిన్న సేడ్స్ లో కనిపించబోతున్నాడు.
మొదట ఈ సినిమాలో అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోందని తెలిసింది. సినిమా ఓపెనింగ్ రోజున అను ఇమ్మాన్యుల్ చిత్ర యూనిట్ తో పాల్గొనడం జరిగింది. తాజా సమాచారం మేరకు అను ఇమ్మాన్యుల్ స్థానంలో ఇలియానా వచ్చినట్లు తెలుస్తోంది. ఇలియానాను ఎందుకు తీసుకున్నారో తెలిదు. గతంలో రవితేజ, ఇలియానా దేవుడు చేసిన మనుషులు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











