మెగా హీరోలతో చేశా.. తప్పు అక్కడే జరిగింది.. షాకిచ్చిన క్రేజీ బ్యూటీ

సినీ ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో.. ఏ ఆఫర్స్ అంగీకరిస్తే కెరీర్ ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న హీరోయిన్ ఒక్కసారిగా డీలా పడటం, కేవలం ఒకటి రెండు సినిమాలతోనే కొందరు స్టార్ హీరోయిన్ క్రెడిట్ కొట్టేయడం చూస్తుంటాం. ఈ కోవలోనే మొదటి వర్గానికి చెందిన బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్.

మజ్ను సినిమాలో టాలీవుడ్ గడప తొక్కిన ఈ కేరళ బ్యూటీ.. వచ్చి రాగానే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ వెంటనే వరుస అవకాశాలు పట్టేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా అలరించింది. కానీ ఇంతలో ఊహించని విధంగా అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ స్లో కావడం ఆశ్చర్యానికి గురి చేసింది.

 Anu Emmanuel Suffers With Movie Chances.. The reason is..!

యూత్‌ ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్ల లోనే మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ పట్టేసింది. పవన్ కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి', అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' లాంటి సినిమాల్లో రొమాన్స్ చేసింది. కానీ ఈ సినిమాల ఎఫెక్ట్ ఆమెపై ఏ మాత్రం కనిపించలేదు. దీంతో రియలైజ్ అయిన ఆమె.. ఇప్పుడు చేసిన తప్పుపై ఫోకస్ పెట్టింది.

సినిమా కథల విషయంలో పెద్దగా దృష్టి పెట్టకుండా ఓకే చేయడం వల్లనే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని సన్నిహితుల వద్ద చెప్పుకుంటోందట అనూ ఇమ్మాన్యుయేల్. ఈ సారి తెలుగు నుంచి అవకాశం వస్తే.. కథ, క్యారెక్టర్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని చెబుతోంది అనూ. చూడాలి మరి అనూ కెరీర్ ఇకనైనా దారిలో పడుతుందో.. లేదో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X