»   »  'ఆర్య' హీరోయిన్ అరెస్టా?

'ఆర్య' హీరోయిన్ అరెస్టా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anu Mehta
అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆర్య' సినిమా హీరోయిన్ అనుమెహతా ఇప్పుడు కష్టాల్లో పడిందని తమిళ పరిశ్రమలో టాక్ ఆఫ్ టుడే గా మారింది. ఆమె చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోయినా అప్పటి అలవాట్లు లగ్జరీ మానలేకపోతోందని దాంతో రకరకాల ఇబ్బందులకు లోనవుతోందని తెలుస్తోంది.వారు చెప్పుకునే దాని ప్రకారం ఆమె వీకెండ్ పార్టీ నిమిత్తం కొంతమంది ఆడ,మొగ స్నేహితురాళ్ళతో కలిసి ఓ రిసార్టు లో మకాం వేసిందిట. అయితే అక్కడ తాగి విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ గొడవ చేస్తూండటంతో విసిగిన రిసార్ట్ మేనేజ్ మెంట్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారుట. దాంతో వారు సైలెంట్ గా వచ్చి దాడి చేసి అరెస్ట్ చేసారుట. దాంతో దాదాపు మూడు గంటలు సేపు హై డ్రామా జరిగి కొంతమంది పెద్దలకు ఫోన్స్ చేసి చెప్పించటం,డబ్బిచ్చి సెటిల్ మెంట్ చేసుకోవటం జరిగిందిట.తాగింది దిగిపోవటమే కాక ఎఫ్ .ఐ.ఆర్ రాయకుండా బయిటపడినందుకు సంతోషపడుతూ వారు ఇళ్ళకు చేరుకున్నారుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X