»   » హిట్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ సినిమాకు వాయించేది ఆయనే?

హిట్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ సినిమాకు వాయించేది ఆయనే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుస మ్యూజిక్ హిట్లు అందిస్తున్న సంగీత దర్శకుడు అనూపర్ రూబెన్స్...ఇటీవలం విడుదలైన 'మనం' సినిమాతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్-వెంకీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓమైగాడ్ తెలుగు రీమేక్ సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల అనూప్ రూబెన్స్ వర్క్ చూసి అతన్ని పిలిపించుకుని మరీ మెచ్చుకున్నారట పవన్. ఈ క్రమంలో తన తర్వాతి సినిమాకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అఫీషియల్‌గా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది. డాలీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

Anup Rubens music for Pawan Kalyan movie

'ఓ మై గాడ్' తెలుగు వెర్షన్‌కు 'దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. గతంలో 'జల్సా' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగానే 'దేవ దేవం భజే'చిత్రానికి కూడా మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇలా చేస్తే సెంటిమెంటు కలిసొస్తుందని, జల్సా మాదిరిగా ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు మహేష్ బాబును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

తెలుగు నేటివిటికి తగినట్లు ఈచిత్రాన్ని మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని, దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
It is said that Pawan Kalyan recently watched the film and is thoroughly impressed with Anup Rubens' work. He reportedly called him and congratulated for the excellent work. Pawan Kalyan even offered him to work for his next film, a remake of Bollywood blockbuster, Oh My God. And thus Anup Rubens will be scoring music for one of the biggest multistarer films starring Venkatesh and Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu