జూ ఎన్టీఆర్ ‘రభస’... తమన్‌కు అనూప్ ఎసరు!
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో 'రభస' చిత్రంతో నటించబోతున్న సంగతి తెలిసిందే. కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.
తొలుత ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్‌ను అనుకున్నప్పటికీ.... తాజాగా ఆయన్ను మార్చి అనూప్ రూబెన్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడనుంది. ఇప్పటి వరకు చిన్న హీరోల సినిమాలకే పరిమితమైన అనూప్‌కు ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. దీంతో పాటు నాగార్జున ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రానికి కూడా ఆయన సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ రెండు చిత్రాల సంగీతం హిట్టయితే అనూప్ రూబెన్స్ టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడం ఖాయం అంటున్నారు సినీ పండిట్స్.
కాగా....ఇటీవలే 'రభస' టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారు నిర్మాతలు. రభస చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించనుంది. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న ఈచిత్రం జులై లేదా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications