మహేష్ తండ్రిగా బాలీవుడ్ పెద్దాయన
బాలీవుడ్ పెద్దాయన అని ముద్దుగా పిలుచుకునే అనుపమ ఖేర్ త్వరలో మహేష్ కి తండ్రిగా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్,వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ప్రకాష్ రాజ్ తప్పుకోవటంతో ఆ ప్లేస్ లోకి అనుపమ ఖేర్ వచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ మేరకు దిల్ రాజు ఈయనను స్క్రీన్ టెస్ట్ కి రమ్మన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్లేసులోకి సత్యరాజ్ ని,నాజర్ ని స్క్రీన్ టెస్ట్ చేసి చూసారు కానీ దర్శకుడు సంతృప్తి చెందలేదు. ఎందుకంటే మహేష్ ఒక్కడికే కాక వెంకటేష్ కి కూడా తండ్రిగా కనిపించాలి.
ఇక ఈ పాత్రను సాధ్యమైనంత తొందరలో ఫైనలైజ్ చెయ్యాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత చేస్తోంది. కొత్త బంగారు లోకం చిత్రంతో పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ఇక అనుపమ ఖేర్ ని ఎంచుకోవటానికి కారణం ఆయన గతంలో చేసిన దిల్ వాలే దుల్హానియా లేజాయింగే,హమ్ ఆప్ హై కౌన్,మైనే ప్యార్ కియా చిత్రాలు తెలుగునాట ఘన విజయం సాధించాయి. దాంతో ఆయన్ని పెట్టినా నేటివిటీ సమస్య రాదని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











