Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరు చిన్నల్లుడితో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఖరారైనట్లు సమాచారం.
హీరోయిన్ ఎవరంటే?
ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కళ్యాణ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించే అవకాశాలున్నట్లు టాక్. ఇటీవలే చిత్ర బృందం ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం.
సత్యానంద్ వద్ద శిక్షణ
కళ్యాణ్ యాక్టింగ్, డాన్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్, వరుణ్ తేజ్ లకు శిక్షణ ఇచ్చిన ‘స్టార్ మేకర్' సత్యానంద్ వద్దే కళ్యాణ్ కూడా శిక్షణ తీసుకున్నారట.
త్వరలో సెట్స్ మీదకు
కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యే ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. జనవరి నెలలో మంచి రోజు చూసి సినిమాను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రేమకథా చిత్రం
మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలంటే పూర్తి కమర్షియల్ గా ఉంటాయి. అయితే కళ్యాణ్ లాంచ్ అయ్యే సినిమా మాత్రం అందుకు భిన్నంగా క్యూట్ లవ్ స్టోరీ కాన్సెప్టుతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.