Anupama Parameswaran: 54 ఏళ్ళ హీరోతో అనుపమ రొమాంటిక్ మూవీ..?

ప్రేమమ్ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఓవర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈ బ్యూటీ తెలుగులో నటించిన మొదటి సినిమా అఆ భారీ విజయాన్ని అందుకుంది. త్రివిక్రమ్ నితిన్ కలయికలు వచ్చిన ఆ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ విజయాన్ని అందుకోవడంతో అనుపమకు వెంట వెంటనే అవకాశాలు వచ్చాయి. దానికి తోడు శతమానం భవతి సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది.

ఇక అనుపమ పరమేశ్వరన్ వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు చిత్ర పరిశ్రమంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలు అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు అంతగా ఆసక్తి చూపదు అని ఒక టాక్ అయితే అప్పట్లో ఉంది. కానీ ఇటీవల రౌడీ బాయ్స్ సినిమాల్లో మాత్రం అనుపమ కనిపించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో ఒక రొమాంటిక్ సన్నివేశంలో ఏకంగా లిప్ లాక్ తో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

Anupama Parameswaran romantic movie with senior star hero

పాత్ర నచ్చితే అలాగే సినిమాకు అవసరమైతేనే అలాంటి సన్నివేశాలలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా అనుపమ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ తనకంటే వయసులో దాదాపు 28 ఏళ్లు పెద్ద అయిన సీనియర్ హీరోతో రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి రెడీ అయిందట. ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ అని తెలుస్తోంది.

రవితేజ వయసు 54 అయినప్పటికీ ఇంకా ఇప్పుడే పాతికేళ్లు దాటిన హీరోలాగా కనిపిస్తూ ఉంటాడు. అయితే అతను అనుపమ పరమేశ్వరన్ తో చేయబోయే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయట. సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాతో అప్పట్లో మంచి గుర్తింపు అందుకున్నారు యువ దర్శకుడు కార్తీక్ ఆ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ఒక క్లారిటీ రానున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X