దిల్ రాజు సోదరుడి కొడుకుతో అనుపమ ప్రేమాయణం.. దాని కోసమే అంటున్నారు.!

By Manoj Kumar P

చేసింది తక్కువ సినిమాలో అయినా.. ఎక్కువ పేరును సంపాదించుకుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. నాగ చైతన్య నటించిన 'ప్రేమమ్' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది. తాజాగా ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

అనుపమ పరమేశ్వరన్ అక్కడ బాగా బిజీ

అనుపమ పరమేశ్వరన్ అక్కడ బాగా బిజీ

వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది గ్లామరస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో అనుపమను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది.

అందరికీ అనుపమనే కావాలి.. అందుకే అలా

అందరికీ అనుపమనే కావాలి.. అందుకే అలా

మలయాళ సినీ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయిన అనుపమ.. అందంతో పాటు అద్భుతమైన నటనతో రాణిస్తోంది. అందుకే ఆమెకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే అనుపమ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తోంది. అన్ని చోట్లా ఆమెకు ఆదరణ లభిస్తుండడంతో, ఫిల్మ్ మేకర్లు ఆమె డేట్ల కోసం క్యూ కడుతున్నారు.

క్రికెటర్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిందిలా

క్రికెటర్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిందిలా

అనుపమ పరమేశ్వరన్.. టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం సోషల్ మీడియాలో ఈ ఇరువురూ ఒకరినొకరు ఫాలో అవుతుండడమే. ఈ వార్తలు దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడంతో అనుపమ పలుమార్లు దీనిపై క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఆ వార్తలకు బ్రేక్ పడలేదు.

Recommended Video

Anupama Parameswaran Speech At Rakshasudu Movie Press Meet || Filmibeat Telugu
దిల్ రాజు సోదరుడి కొడుకుతో ప్రేమాయణం

దిల్ రాజు సోదరుడి కొడుకుతో ప్రేమాయణం

తాజాగా అనుపమ పరమేశ్వరన్‌ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశీష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ‘రౌడీ బాయ్స్' సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైందట. ఈ మూవీలో ఆమెకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించిందని, అందుకే దీనికి ఓకే చేసేసిందని ప్రచారం జరుగుతోంది.

వాళ్లతో ఇప్పటికే రెండు సార్లు కలిసింది

వాళ్లతో ఇప్పటికే రెండు సార్లు కలిసింది

అనుపమ ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో రెండు సినిమాలు ‘శతమానం భవతి', ‘హలో గురూ ప్రేమ కోసమే' దిల్ రాజు నిర్మాణంలో నటించింది. ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఈ సినిమాకు కూడా అనుపమను తీసుకుంటున్నారని, ఇందుకు గానూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X