‘బాహుబలి’ కి అనుష్క రెమ్యునరేషన్
అనుష్క సినిమాలో ఉందంటే తమిళ,తెలుగులో బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందన్న సంగతి తెలిసిందే. దాంతో అంతా ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారు. ఆమె ఆచితూచి అడుగులు వేస్తూ...తన రెమ్యునేషన్ ని ఆ క్రేజ్ కు తగినట్లు పెంచుకుంటూ పోతోంది. ఆ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ పారితోషికం అందుకుంటున్న భామగా అనుష్క మరోసారి సరికొత్త రికార్డును సృష్టించింది.
అప్పట్లో విజయశాంతి 80 లక్షల పారితోషికాన్ని తీసుకుంటేనే పెద్ద రికార్డు. ఇప్పు డు ఒక్క సినిమా హిట్ అయితే హీరోయిన్లకు మినిమం ఒక కోటి అందుతోంది. హీరో, హీరోయిన్, కమెడియన్ ఎవరైనా సరే వారి పారితోషికాలు చుక్కల్లో చేరాయి. దూకుడు విజయవంతం కావడంతో సమంత మార్కెట్ కోటిపైనే చేరిపోయింది. మగధీరకు ముందు కేవలం లక్షల్లో వున్న కాజల్ పారితోషికం ఆ సినిమా హిట్ అవడంతో కోటి మైలురాయి దాటేసింది. దాంతో అనుష్క రెమ్యునేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి'చిత్రం రూపొందుతోంది. ప్రబాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. రానా కూడా ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఆ పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉండబోతోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రం ప్రభాస్,అనుష్క కెరీర్ లో నిలిచిపోతుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications












