అనూష్క మళ్ళీ బికినీలో...?
బిల్లా చిత్రంలో బికినీలో కన్పించిన అనూష్క మరోసారి అదే పనిచేయనుందని సమాచారం. అయితే ఈ సారి రవితేజ హీరోగా రానున్న డాన్ శీను చిత్రంలో అని తెలుస్తోంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ..అమితాబ్ డాన్ చిత్రాన్ని పదే పదే చూసి అందులో మై హూ డాన్ అనే డైలాగులు వల్లిస్తూంటాడు. అతని పిచ్చి గమనించిన ప్రెండ్స్ ముంబయి వెళ్ళి డాన్ కమ్మని సలహా ఇస్తారు. అక్కడ శ్రీహరి అనే డాన్ పరిచయమవుతాడు. అతని చెల్లి అనూష్క. అక్కడ నుండి కథ మరో మలుపు తిరుగుతుంది అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ చిత్రం కథ వినపడుతుంది. ఆ క్రమలో అనూష్క బికినీలో కనపడే సన్నివేశం ఉంటుందని వినికిడి. ఇక గోపీచంద్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నఈ చిత్రం పూర్తి స్ధాయి మాస్ ఎంటర్టైనర్ గా సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి కోనవెంకట్..కథ-మాటలు అందిస్తున్నాడు. రవితేజ, అనూష్క కాంబినేషన్లో గతంలో విక్రమార్కుడు అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది. అలాగే డాన్ శీను నిర్మాతలు ఇంతకు ముందు రవితేజతో కిక్ అనే హిట్ ఇచ్చిఉన్నారు.


Click it and Unblock the Notifications











