»   » అనుష్కకే అంకితమయ్యాడు కాబట్టే నాగార్జున...

అనుష్కకే అంకితమయ్యాడు కాబట్టే నాగార్జున...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్క ప్రక్కన లేకపోతే నాగార్జునకి నడిచేటట్లు లేదు. ఆమెను కంటిన్యూగా తన ప్రక్కన బుక్ చేయమని నాగార్జున ఒత్తిడి తెస్తున్నారని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతుంది. అంతేగాక రీసెంట్ గా నాగార్జున..ఆమెను కౌగిలించుకున్న ఫోటోని ఒకటి ట్విట్వర్ లో పెట్టి అభిమానులకు పండగ చేసాడు. ఇదిలా ఉంటే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న సోషియో పాంటసీ చిత్రంలో తప్పనిసరిగా అనుష్కనే పెట్టుకోవాలని నిర్మాతలైన ఆర్.ఆర్.మూవి మేకర్స్ కి అల్టిమేటం ఇచ్చాడని, వాళ్ళు వెంటనే అనుష్కని తీసుకున్నారని తాజా వార్త. ఇక అనుష్క ఆల్రెడీ నాగార్జున సరసన వీరూపోట్ల తాజా చిత్రంలో చేస్తోంది. అంటే నాగార్జున డేట్స్ పట్టుకోవాలంటే ముందుగా అనుష్కని పట్టుకోవాలి. సూపర్ చిత్రంతో తను పరిచయం చేసిన ఆమెతో తర్వాత డాన్ చేసారు. అలాగే కేడీలోనూ ఐటం సాంగ్ పెట్టుకున్నారు. అంతేగాక వీళ్ళిద్దరూ కలిసి తకిట తకిట చిత్రంలో గెస్ట్ రోల్స్ వేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu