అనుష్క ఓకే అందా సరే...డైరక్టర్ ఎవరూ?

By Srikanya

హైదరాబాద్: ఇప్పటికే భారీ పీరియడ్ చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి చేస్తూ బిజీగా ఉన్న అనుష్క మరో పీరియడ్ చిత్రం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తారామతి టైటిల్ తో ఓ చారిత్రక చిత్రం చేయనున్నారని వినిపిస్తోంది. మిర్చి, ఇటీవల రన్ రాజా రన్ చిత్రాలు నిర్మించిన యువి క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెప్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమైందని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని చెప్పుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పటం లేదు.

కొత్త వారికి ఇంతంత భారీ బడ్జెట్ సినిమాలు అప్పచెప్పరు. అలాగని మన దర్శకులలో చారిత్రిక చిత్రాలు తీయాలన్న అభిరుచి, తీయగల సత్తా ఉండి ప్రస్తుతం ఖాళీగా ఉన్న దర్శకులు ఎవరున్నారు. ఇంతేకాకుండా ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ గా చేయనున్నారని అంటున్నారు. తన స్నేహితులు నిర్మాతలు కాబట్టి, అనుష్క తో ఉన్న అనుబంధంతో ఒప్పుకోవచ్చు కానీ అనుష్క,ప్రభాస్ లకు అంత తీరిక ఎక్కడది..ఈ సందేహాలన్నీ ఈ విషయమై అఫీషయల్ మీడియా నోట్ వస్తే కానీ తేలదు. అయితే ఇప్పటిదాకా అలాంటిదేం లేదు.

Anushka in another Historical film

ఇంతకు ముందు కూడా అనుష్క తో ...భాగమతి చిత్రం చేయనున్నారనవి వార్తలు వచ్చాయి. పిల్ల జమీందారు అశోక్ ఈ చిత్రం ప్లాన్ చేసాడని చెప్పుకున్నారు. కానీ అది పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ తారామతి వార్త ఎంతవరకూ నిజం అవుతుందనేది చూడాలి. అనుష్క మాత్రం తన తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉంది. తెలుగులో రెండు చిత్రాలు మొదట ఫినిష్ చేసి తమిళంలో బిజి అవ్వాలనే ఆలోచన ఆమెలో కనపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X