వెంకటేష్ నాగవల్లిలో చంద్రముఖి ఎవరో తెలిసిపోయిందోచ్..!?
వెంకటేష్ హీరోగా 'చంద్రముఖి2" అయిన 'నాగవల్లి" రూపొందుతోన్న విషయం తెలిసిందే. పి వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, కమలినీ ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్, పూనమ్ కౌర్ నటిస్తున్నారు. ఇంతమందిలో చంద్రముఖి ఎవరు? అనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపద్యంలో ఈ చిత్రంలో అనుష్క ఫోటో ఒకటి విడుదల అయ్యింది. తను భరతనాట్యం డ్రెస్ లో ఉంది. దాంతో ఈ చిత్రంలో అనుష్కే చంద్రముఖి అని చాలామంది నిర్థారణకు వస్తున్నారు. అలాగే కమలిని ముఖర్జీకి సంబంధించిన ఒక స్టిల్ విడుదలయ్యింది. ఆ స్టిల్ చూసి ఒకవేళ జ్యోతిక చేసిన క్యారెక్టర్ కమలినీ చేస్తుందేమోనని, చంద్రముఖిగా అనుష్క చెస్తోందేమోనని మాట్లాడుకుంటున్నారు.
అనుష్క కమలినీ ముఖర్జీ వెంకటేష్ నాగవల్లి బెల్లంకొండ సురేష్ పి వాసు శ్రద్దాదాస్ రిచా గంగోపాధ్యాయ anushka kamalini mukherjee venkatesh nagavalli bellamkonda suresh p vasu shraddha das


Click it and Unblock the Notifications