twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పార్వతికి త్రివిక్రమ్ అన్యాయం?

    By Staff
    |

    Parvathi Melton
    జల్సా చిత్రం నుండీ త్రివిక్రమ్, పార్వతీ మిల్టన్ మధ్య బంధం బలపడిందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తగినట్లుగానే త్రివిక్రమ్ సైతం...పార్వతికి తను చేయబోయే మహేష్ బాబు సినిమాలో సైతం ఆమెకు ఆఫర్ ఇస్తానని ప్రామిస్ చేసాడు. దాంతో పొంగిపోయిన ఆమె ఆ పాత్ర కోసం స్పెషల్ గా ఎక్సర్ సైజులూ అవీ చేసింది. మహేష్ ప్రక్కన చేస్తే తన లైఫ్ మారుతుందని పొంగిపోయింది.

    అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఆ ప్లేసులోకి అనూష్క వచ్చి చేరింది. దాంతో ఆమెకేమీ పాలుపోని స్ధితి ఏర్పడింది. అరుంధతి విజయం అనూష్కకి గిప్ట్ గా మహేష్ సరసన ఛాన్స్ ఇప్పిస్తే అది పార్వతికి కోలుకోలేని దెబ్బగా మారింది. ఎందుకంటే ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న పార్వతి కొత్తగా ఏ ప్రాజెక్టూ ఒప్పుకోలేదు. అయితే ఇదంతా మహేష్ పుణ్యమేనని అంటున్నారు. అతను పట్టుపట్టి మరీ ఆమెను తీయించేసాడని సమాచారం. అయితే ఈ కోపం మనస్సులో పెట్టుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాను ఎలా తీస్తాడని కొందరి అనుమానం.

    ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర మిస్ యూనివర్స్ అని, ఆమె..టాక్సీ డ్రైవర్ అయిన మహేష్ తో ప్రేమలో పడుతుందని వార్తలు వచ్చాయి. కనకరత్నా మూవిస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే భారి క్రేజ్ ఏర్పడింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా త్రివిక్రమ్ తన దైన పంచ్ డైలాగుల స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. అలాగే ఈ చిత్రం అతిధి పరాజయం అనంతరం చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న కావటంతో చాలా కసితో ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలనే కసితో మహేష్ చేయనున్నాడని చెప్తున్నారు.

    ఇక పార్వతి మిల్టన్ మాత్రం అలిగి తన స్వస్ధలమైన న్యూయార్క్ వెళ్ళిపోయిందని తెలుస్తోంది. ఏదైమైనా త్రివిక్రమ్ ఆశపెట్టి మరీ ఓ ఆడకూతురుకి అన్యాయం చేసాడని అంతా అంటున్నారు. మార్చి మొదటి వారం నుండి ఈ సినిమా ప్రారంభమవుతుంది. పార్వతి మాత్రం తాను తన తల్లికి ఏక్సెడెంట్ అవటం వల్లే అమెరికా వెళ్ళానంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X