అనుష్క డేట్స్ ని ఆ నిర్మాత బ్లాక్ మెయిల్ తో!?
నట్టికుమార్ త్వరలో బొమ్మాళి అనే టైటిల్ తో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం హీరోయిన్ గా ఇలియానాని అడిగాడు. ఆమె డేట్స్ ఎడ్జెస్టు చేయనంటే ఆమె రెమ్యునేషన్ గురించి మీడియాలో దుమ్మెత్తి పోసాడు. అయితే ఇప్పుడు ఆయన దృష్టి అనుష్క పై పడిందంటున్నారు. ఆమెను తన చిత్రంలో నటింపచేసి అరంధుతి రేంజి హిట్టు కొట్టాలని తలపోస్తున్నారు. అయితే ఇలియానాకి జరిగిన ట్విస్టుని దృష్టిలో పెట్టుకుని అనుష్క ఏం సమాధానం ఇస్తుందా అని ఇండస్ట్రీలో ఎదురుచూస్తున్నారు. అనుష్క కనుక ఒప్పుకోకపోతే ఆమెపై ఏదో ఒక విషయమై మీడియాలో మారు మ్రోగటం ఖాయం అంటున్నారు. డేట్స్ కోసం ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి పాల్పడటం ఎంతవరకూ సబబు అంటున్నారు. ఇక ప్రస్తుతం అనుష్క తమిళ వేదం చిత్రంలో నటిస్తోంది. అలాగే అనుష్క పవన్ కళ్యాణ్,సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో రూపొందుతున్న జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రంలోనూ, ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలోనూ, నాగార్జున సరసన ఢమరుకం చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications