పవన్, పూరీ చిత్రంలో కాజల్ కాదా?

By Srikanya

పవన్ కళ్యాణ్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో కమెరామెన్ గంగతో రాంబాబు అనే చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన చేసే హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గా మారింది. మొదట ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తుందనుకున్నారు. కానీ ఆమెకు డేట్స్ సమస్య రావటం తో నో చెప్పిందని తెలుస్తోంది. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఆ పాత్రను అనూష్క చేయనున్నట్లు వినపడుతోంది. గంగగా ఆమెను పూరీ ఎంపిక చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే అనూష్క మాత్రం డేట్స్ ఇంకా ఖారారు చెయ్యలేదని, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పినట్లు సమాచారం.

ఇక ఈ చిత్రం మే 15 న లాంచ్ అవుతుంది. సెప్టెంబర్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ నెలలో రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నాడు. డివివి దానయ్య యూనివర్శల్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది. అనంతరం మే నెల నంచి పవన్-పూరి సినిమా సెట్స్ పైకి రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X