బాలయ్య ‘ఆదిత్య 369’లో హాట్ అనుష్క?

By Bojja Kumar

నందమూరి నటసింహం బాలయ్య త్వరలో గతంలో తాను నటించిన 'ఆదిత్య 369' సీక్వెల్‌లో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ంరలో బాలయ్య సరసన అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. గతంలో అనుష్క బాలయ్యతో ఒక్కమగాడు చిత్రంలో రొమాన్స్ చేసింది.

బాలయ్య నటించిన హిట్ చిత్రాల్లో 'ఆదిత్య 369' ఒకటి. 1991లో విడుదలైన ఈచిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపింది. ముఖ్యంగా ఈచిత్రంలో బాలయ్య పోషించిన శ్రీకృష్ణ దేవరాయల పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పటికీ ఆచిత్రం టీవీలో వస్తుందంటే ఆసక్తిగా చూసే వారు ఎందరో. అంత అద్భుతంగా ఉంటుందా ఆ చిత్రం.

ఈ చిత్రానికి సింగితం శ్రీనివాస రావు ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కొండ కృష్ణం రాజు సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X