‘రుద్రమదేవి’లో అనుష్క బికినీ? ఇదేం విడ్డూరం!

By Bojja Kumar

హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న 'రుద్రమదేవి' సినిమాకు సంబంధించిన ఓ హాట్ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క బికినీలో కనిపించనుందట. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో బికినీలేంటి? అనే డౌట్ మీకు రావచ్చు. అది ఇప్పటి హీరోయిన్లే వేసే బికినీ కాక పోయినా.....ఆ తరహా లుక్ ఉంటుందట. ఇటీవల కుంటాల వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన షూటింగులో ఇందుకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారట.

గుణా టీం వర్క్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియోస్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X