అనుష్క ఆ హీరో కోసమే వచ్చిందా?
అరేబియా గుర్రం లాంటి హైటు, వెయిటుకు తోడు నవనవలాడే అందాలు ఆమె సొంతం. ఆమంటే అభిమానులే కాదు తోటి హీరోలు పడి చస్తారు. ఆమెతో ఒక్కసారైన చేయాలనుకుంటారు రొమాన్స్ సినిమాల్లో. అందుకే ఆమంటే టాలీవుడ్ లో అంతటి క్రేజ్. ఈ మధ్య ఆమె సినిమాలు లేక ఆమె గురించి గుసగుసలాడుకోవడం మానేశారు కానీ, ఆవిడ తెరపై కనిపించిందంటే అందరి చూపు ఆవిడ అందాలపైనే. ఈవిడ ఎవరో కాదు టాలీవుడ్ హాట్ లేడీ అనుష్క. అనుష్కతో టాలీవుడ్ టాప్ హీరోలు నాగార్జున, మహేష్ బాబు తదితరుతో ఎఫైర్ ఉందని తరచూ పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అందులో నిజం ఎంత అనే విషయం పక్కన పెడితే...అనుష్క స్వయంగా ఓ హీరో కోసం రావడం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశమైంది. ఆ హీరో ఎవరో కాదు గోపీచంద్.
గోపీచంద్ నటించిన మొగుడు మూవీ ఆడియో ఇటీవల విడుదలైంది. ఈ కార్య్రకమానికి హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది అనుష్క. గోపీ చంద్ పక్కనే రాసుకుపూసుకు తిరుగుతూ అందరూ గుసగుసలాడుకునేలా ప్రవర్తించింది. గోపీచంద్, అనుష్క జంటగా గతంలో శౌర్యం సినిమాలో్ నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాలా సన్నిహితమైన 'సం"బంధం ఏర్పడిందని ఫిల్మ్ నగర్ టాక్. ఆ చనువుతోనే గోపీచంద్ అనుష్కను ఈ వేడుకకు ఇన్వైట్ చేశాడని, స్వయంగా గోపీ పిలవడంతో కాదనలేక అనుష్క వచ్చిందని సమాచారం. ఆ సినిమా త్వరాత ఇద్దరి మధ్య 'సం"బంధం కట్ అయిందని అంతా అనుకున్నారు. ఈ సంఘటనతో ఇద్దరి మధ్య ఆ..బంధం ఇంకా కొనసాగుతుందని చెవులు కోరుక్కుంటున్నారు సినీ జనాలు.


Click it and Unblock the Notifications











