మహేష్ కి దురదృష్టం తెచ్చిపెట్టే ఐరన్ లెగ్..అనుష్క
త్వరలో రిలీజ్ కానున్న మహేష్ ఖలేజా చిత్రలో అనుష్క హీరోయిన్ గా చే్స్తున్ సంగతి తెలిసిందే. ఆమె పాత్ర పేరు బంగారం. అయితే ఆమె పేరుకు బంగారమే అయినా సినిమా అంతటా ఆమె కనిపించే ప్రతీ సీన్ లోనూ మహేష్ ని ఇబ్బంది పెడుతుంది. ఓ కోటీశ్వరుడి కూతురుగా కనిపించే ఆమె పాత్ర ప్రకారం ఐరెన్ లెగ్. ఆమెతో కలిసినప్పుడల్లా మహేష్ కి ఏదో దురదృష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఈ కామిడీ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. ఇక మహేష్ బాబు ఈ చిత్రంలో ఎప్పుడూ వాగుతూండే క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. దైవం..మానుష్య రూపేనా అనే పాయింటుతో ఈ చిత్రం కథ నడుస్తుందని త్రివిక్రమ్ చెప్తున్నారు. ఇక మహేష్ అయితే ఈ చిత్రంలో హైలెట్స్ చెబుతూ..ఈ చిత్రంలో హైలెట్స్ గా ఎవరూ ఊహించిని విధంగా ఉండే కెమెరా వర్క్..(ముఖ్యంగా లెంగ్తీ షాట్స్, జూమ్ ఆన్ స్టెడీ కామ్), పెట్రోలు బంక్ లో ఫైట్ సీన్ (రామ్ లక్ష్మణ్ డైరక్ట్ చేసింది), బ్రహ్మానందం, సునీల్ కీ, నాకు(మహేష్) మధ్య వచ్చే కామిడీ ట్రాక్" అంటున్నారు. ఇక ఖలేజా చిత్రం ఆడియో సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. సోనీ మ్యూజిక్ వారు ఈ చిత్రం ఆడియోను సొంతం చేసుకున్నారు. మరో ప్రక్క నిర్మాతలు శింగనమల రమేష్, సి కళ్యాణ్..ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి అక్టోబర్ 7న గ్యారెంటీగా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











