తాను తవ్విన గోతిలో తానే పడటమంటే అదే మరి: అనుష్క!
బంగారు బొమ్మలాంటి బ్యూటి అనుష్కకి ఇప్పుడొక చిక్కొచ్చి పడింది. లేక లేక మొదటి సారి దైర్యం చేసి 'వేదం" లో కీలమైన వేశ్య పాత్ర పోషించింది అనుష్క. ఈ చిత్రం మే నెల ప్రధమార్థంలోనే విడుదల కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఇప్పుడది జూన్ 4కి వాయిదా పడింది. సిరిగ్గా అదే రోజున 'అరుంధతి" తర్వాత అనుష్క అంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర పోషించిన 'పంచాక్షరి" విడుదలకి సిద్దమవుతోంది. అదే ఇప్పుడు అసలు సమస్య. ఎందుకంటే 'వేదం" సినిమాలో వీధుల్లో నిలబడి పూటకో రేటు మాట్లాడుకునే పచ్చి వేశ్య పాత్ర వేసిన తనని, వెంటనే 'పంచాక్షరి" సినిమాలో వేసిన పవిత్రమైన పాత్రలో ఆడియెన్స్ఎలా రిసీవ్ చేసుకుంటారో అని తెగ మధనపడిపోతోంది అనుష్క.
తనకి తానే పోటీ అయ్యి తనని తానే తీపి బాధకి గురిచేసుకుంటున్న అనుష్క, ఒకే సారి అటు రక్తిని..ఇటు భక్తిని ప్రేక్షకులకు అందించనుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రేక్షకులు, 'భక్తి" పారవశ్యంలో అనుష్కను ఆరాధిస్తారో…'రక్తి" పరవశంతో తన అందాల 'ఆరాలు" తీస్తారో…లేక, దేని దారి దానిదే అంటారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే!


Click it and Unblock the Notifications











