»   » దడ పుట్టిస్తున్నఅనుష్క డైలీ ఛార్జ్ !?

దడ పుట్టిస్తున్నఅనుష్క డైలీ ఛార్జ్ !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అరుంధతితో పూర్తి స్ధాయి బిజీగా మారిన అనుష్క తన రేటుని కూడా డిమాండ్ కు అణుగుణంగా పెంచేసింది. తాజాగా వినపడుతున్న సమాచారం ప్రకారం అనుష్క కాల్ షీట్ ల లెక్కన రెమ్యునేషన్ వసూలు చేస్తోంది. రోజుకి రెండు లక్షలు చొప్పున ఆమె తీసుకుంటోందని తెలుస్తోంది. గమ్యం ఫేమ్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న వేదం చిత్రానికి ఆమె ఇచ్చిన కాల్షీట్స్ కేవలం 28 రోజులు మాత్రమే. అయితే అందుకు ఆమె 56 లక్షలు వసూలు చేసిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే మహేష్ తో చేస్తున్న త్రివిక్రమ్ సినిమాకు కూడా ఆమె గట్టిగానే వసూలు చేసిందని చెప్తున్నారు. కాస్తో కూస్తో కనికరం చూపింది సముద్రతో చేస్తున్న పంచాక్షరి చిత్రానికే అని చెప్తున్నారు. అది కూడా తన కెరీర్ ప్రారంభం రోజులో ఆ నిర్మాత చంద్ర(నాగార్జున మేకప్ మేన్) కు ఇచ్చిన హామీ మేరకు చేస్తోందని అంటున్నారు. అందుకే బెల్లంకొండ సురేష్ మొదట అనుష్కని తమ చంద్రముఖి సీక్వెల్ కు అనుకుని ఆ తర్వాత మనస్సు మార్చుకుని ఆ రేటు ఇస్తే బాలీవుడ్ నుంచి అనుష్క శర్మ వస్తుందని భావించాడని చెప్తున్నారు. ఏదైమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే కాన్సెప్టు అనుష్క అమలు చేస్తున్నట్లుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu