లారెన్స్ టార్చర్ పడలేకే అనుష్క
అనుష్క రీసెంట్ గా ప్రభాస్ చేస్తున్న రెబెల్ ప్రాజెక్టునుంచి బయిటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారణాలు రకరకాలుగా పరిశ్రమలో వినిపిస్తున్నాయి. లారెన్స్ తన కాంచన లో ఆమె నటించలేదనే విషయం మనస్సులో పెట్టుకని ఆమెను సాధిస్తున్నాడని, ముఖ్యంగా బాగా లావు అయిందని, తగ్గాలని ఒత్తిడి తెచ్చి ఆమెను మానసికంగా టార్చర్ పెట్టడమే కారణమని వినపడుతోంది. అంతేగాక కాంచన చిత్రం అనుష్క లేకపోవటం వల్లే అంత పెద్ద హిట్టైందని కావాలని ఆమెకు తెలిసేలా మాట్లాడటం వంటివి చేయటం లారెన్స్ చేసి ఇబ్బంది పెట్టాడని తెలుస్తోంది. ఇక అనుష్క తో లారెన్స్ ఇలా మిస్ బిహేవ్ చేయటం నచ్చని నాగార్జున ఆమెను బయిటకు వచ్చేమని చెప్పాడని, లారెన్స్ కు వార్నింగ్ లాంటిది సైతం ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు లారెన్స్ కు ప్రభాస్ సరసన హీరోయిన్ ని తేవటం పెద్ద సమస్యగా మారింది. పెద్ద హీరోయిన్స్ ఎవరూ లారెన్స్ సినిమా అంటే భయపడిపోతున్నారు. దాంతో ఇప్పుడు హీరోయిన్ ఎంపిక ఛాలెంజ్ గా తీసుకుని నెతుకుతున్నాడు.


Click it and Unblock the Notifications











