అనుష్క కాళ్లమీద పడాలనిపించింది!
వారిద్దరూ అన్నదమ్ములు. కవల పిల్లలు. సినిమాలపై పూర్తి అవగాహన ఉన్నవారు టక్కున గుర్తు పట్టేస్తారు. అంత అవగాహన లేనివారు ఎవరు ఎవరో గుర్తు పట్టడం ఎప్పటికీ కష్టమే. వీరిద్దరూ వేదం చిత్రానికి యాక్షన్ కంపోజ్ చేశారు. దర్శకుడు క్రిష్ చెప్పిన కథలో లీనమైపోయారు. ఈమధ్యనే ఫైనల్ ఎడిటింగ్ చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ అనుభూతిని వేదం ప్రెస్ మీట్ లో పంచుకుంటూ..
అనుష్క నటించిన లాస్ట్ సీన్ చూసి ఏడ్చేశాను. హృదయం కదిలించారు. వెంటనే క్రిష్ కు ఫోన్ చేసి సినిమా చూశాను. అనుష్క కాళ్ల మీద పడాలనిపించింది. ఆమె ఈ పాత్ర చేయడం చాలా గ్రేట్. అద్భుతంగా చేసింది. చాలా మంచి కథ. ప్రతి ఒక్కరి మనసునూ తాకుతుంది అన్నారు. ఓ మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
ఇదే ప్రెస్ మీట్ లో అనుష్క మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు రావడం ఇదే మొదటి సారిగా భావిస్తున్నాను. ఈ సినిమాలో మనోజ్, బన్నీ, మనోజ్ బాజ్ పాయ్ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. సినిమా జరిగేటప్పుడు దర్శకుడు మేము మా పాత్రల పేర్లు పెట్టి పిలుచుకునే వాళ్ళం. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి ఈ సినిమా చేశారు. ఈ సినిమాకు కీరవాణి గారు మంచి సంగీతాన్ని ఇచ్చారు. కొన్ని పాటలు వింటేనే కళ్ళవెంట నీళ్ళు కారతాయి. ఇలాంటి స్ర్కిప్ట్ డీల్ చేయాలంటే దర్శకుడికి గట్స్ కావాలి. హీరోలు ఇద్దరు మల్టీస్టారర్ సినిమా చేయడం గొప్ప విషయం. ఇది ఓ గొప్ప సినిమాగా నిలిచి పోతుంది అన్నారు.


Click it and Unblock the Notifications











