అనారోగ్యం పాలైన అనుష్క.. విశ్రాంతి
అనుష్క, గుణశేఖర్ కాంబినేషన్ లో 'రుద్రమదేవి' అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.గుణశేఖర్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ త్రీడీ చిత్రం వరంగల్ లో లొకేషన్స్ చూసుకు వచ్చింది. వరంగల్ పేరు చెప్పగానే వేయి స్తంభాల గుడితో పాటు రాణీ రుద్రమదేవి కూడా గుర్తొస్తుంది. 13వ శతాబ్దపు కాకతీయుల వైభవాన్ని చరిత్ర పాఠాల్లో కథలు కథలుగా చెప్పుకొన్నాం. రుద్రమదేవి సాహస గాథ విని స్ఫూర్తి తెచ్చుకొన్నాం. అవన్నీ మా సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.
2013 ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని గుణశేఖర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చే వరకు అంతటి దేశ భక్తుడి గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. ఈచిత్రం తర్వాత రుద్రమ దేవి ఘనత గురించి అందరూ చెప్పుకుంటారు అనే నమ్మకం వ్యక్తం చేసారు. భారతదేశ చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించబోతున్నాం అని తెలిపారు.
ఇండియాలో తొలి స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం ద్వారా దర్శకుడు గుణశేఖర్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈచిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, సినిమాటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కన్నన్(ప్రసాద్ ఇఎఫ్ఎక్స్), ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, స్క్రిప్టు అసోసియేట్: తోట ప్రసాద్, స్టోరీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్: ముదిగొండ శివప్రసాద్, కాస్టూమ్ డిజైనర్: నీతా లుల్ల(జోధా అక్భర్ ఫేం), మధుబాబు, ఎం.బి.ఎస్.ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications












