హీరో,నిర్మాతపై అనుష్క ఫైర్
ముఖ్యంగా హన్సిక ఈ చిత్రంలో స్కూల్ గర్ల్ గా బబ్లిగా కనపడటం..అనుష్క ఆంటి లుక్ రావటానికి కారణమైంది. దానికి తోడు అనుష్క తో చేసిన చాలా సన్నివేశాలు నేరేషన్ కు అడ్డు వస్తున్నాయని కట్ చేసారని టాక్. దాదాపు సంవత్సరం నుండి అనుష్క ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తోంది. సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్నా ఆమెకు మైనస్ అవ్వటం జీర్ణించుకోలేకపోతోందని చెప్తున్నారు. అందుకే ఆమె సింగం సక్సెస్ మీట్ కు కూడా హాజరు కాలేదని చెప్తున్నారు.
ఇక ప్రస్తుతం అనుష్క సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేసిన వర్ణ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. అలాగే రుద్రమదేవి చిత్రంలో ఆమె రానా సరసన చేస్తోంది. మరో ప్రక్క రాజమౌళి దర్సకత్వంలో రూపొందుతున్న బాహుబలి చిత్రంలో ఆమె ప్రభాస్ కు పెయిర్ గా కనిపించనుంది. ఈ మూడు చిత్రాలు ఆమెకు పూర్వ వైభవం తెచ్చి నెంబర్ వన్ స్ధానంలో కూర్చోబెడతాయని ఆమె భావిస్తోంది.


Click it and Unblock the Notifications












