స్టార్ హీరో సరసన అనుష్క ఖరారు...డిటేల్స్

By Srikanya

హైదరాబాద్ : హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న అనుష్క మరో భారీ చిత్రం కమిటైంది. తమిళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం అది. అజిత్ హీరోగా తెరకెక్కె ఆ చిత్రం వేసవిలో సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ రుద్రమదేవి,రాజమౌళి బాహుబలిలో నటిస్తోంది. రెండు చిత్రాలలోనూ ఆమె రాని గా కనిపించనుంది. అయితే గౌతమ్ మీనన్ చిత్రంలో ఆమె అల్ట్రా మోడ్రన్ గెటప్ లో కనిపించనుందని తెలుస్తోంది.

మరో ప్రక్క అనుష్క భాగమతి అనే టైటిల్ తో ముందుకు రానుందని,ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని వినికిడి. మిర్చి నిర్మాతలు వినోద్-ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెప్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని పిల్ల జమీందార్ తో పరిచయమైన అశోక్ దర్శకత్వం వహించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. నిర్మాతలు మాత్రం ఆమెకు భారీగా రెమ్యునేషన్ ఇచ్చైనా ప్రాజెక్టు మొదలెడదామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అన్నీ సెట్ అయితే 2014 మే నెలలో మొదలయ్యే అవకాసం ఉంది. పిల్ల జమీందార్ తర్వాత అశోక్ చేసిన సుకుమారుడు భారీ ఫ్లాఫ్ అయ్యింది.

Anushka in Gautham Menon’s film

హీరోయిన్ గా మీ విజయం వెనక రహస్యమేమిటని అనుష్కని అడిగితే... ''ఒక్కో అడుగే ముందుకేశాను. రోజూ సెట్‌లో ఏదో ఒకటి నేర్చుకొనేందుకు ప్రయత్నించాను. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఆరాటపడలేదు. నా విజయం వెనక నా కృషి ఎంతుందో, చిత్ర పరిశ్రమ ప్రోత్సాహం కూడా ఉంది. దర్శకులు నాపై నమ్మకంతో మంచి మంచి పాత్రల్ని అప్పజెప్పారు. అవే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి''అని సెలవిచ్చింది.

అలాగే... ''నాకు కూడా మొదట్లో తెలుగు మాట్లాడటం వచ్చేది కాదు. ఎలాగో నటన గురించి ఏమీ తెలియదు, కనీసం భాష కూడా రాకపోతే ఎలా అనిపించేది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మొదట తెలుగు నేర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకొన్నా. అందుకే ఖాళీ సమయంలో తెలుగు టీవీ ఛానళ్లు ఎక్కువగా చూడటం అలవాటు చేసుకొన్నా. భాష అర్థమవ్వడం సులభమైపోయింది. తెలుగే కాదు... ఏ భాష నేర్చుకోవాలన్నా ఈ చిట్కా పాటించడం మంచిది'' అని చెప్పుకొచ్చింది అనుష్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X