»   » ‘బాహుబలి-2‌’ లో అనుష్క కనపడేది ఇలా,మరిన్ని విశేషాలు

‘బాహుబలి-2‌’ లో అనుష్క కనపడేది ఇలా,మరిన్ని విశేషాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి ప్రతిష్ట్తాత్మకంగా రూపొందించిన 'బాహుబలి: ది బిగినింగ్‌'లో అనుష్క దేవసేనగా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్ట్ లో అనుష్కను డీగ్లామర్‌ పాత్రలోనే చూశారు ప్రేక్షకులు.

ప్రభాస్ కు తల్లిగా, భల్లారిదేవుని చేత చెరపట్టడిన మహారాణిగా ఆమె కనిపించింది. దాంతో ఆ పాత్ర పూర్తి స్దాయి పగతో రగిలిపోతూ, తిండి, నిద్ర లేకుండా, భల్లారిదేవుడి మరణం కోసం ఎదురుచూస్తూ, అందుకు చితి పేర్చేందుకు పుల్లలు ఏరుతూంటుంది. ఆ సమయానికి ఆ పాత్రకు తగినట్లు ఆమెను పూర్తి డీ గ్లామర్ గా డిజైన్ చేసి చూపించాడు రాజమౌళి.

ఈ పాత్ర ఆహార్యం కొంతమంది అనుష్క అభిమానులకు నిరాశ కలిగించిన మాట వాస్తవం. అందుకేనేమో..సెకండ్ పార్ట్ లో ఆమె అందచందాలకు పూర్తి ప్రయారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

రానా, తమన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. జాతీయ స్థాయిలో తెలుగు కీర్తిని రెపరెపలాడించింది 'బాహుబలి'. రెండో భాగంతో మరిన్ని సంచలనాలు సృష్టించడానికి రాజమౌళి బృందం సిద్ధమౌతోంది.

స్లైడ్ షోలో ...అనుష్క ఎలా కనపడబోతోంది..మరిన్ని విశేషాలు..

రాజసం..

రాజసం..

రెండో భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌'లో కత్తిపట్టిన ఆమె రాజసం, అంతకుమించిన సోయగాన్ని చూడబోతున్నారు.

ధగధగలు

ధగధగలు


దేవసేన ధగధగల్ని తెరకెక్కించడానికి రామోజీ ఫిలింసిటీ వేదికైంది. అక్కడే ఆమెపై మహారాణిగా సీన్స్ షూట్ చేస్తున్నారు.

దేవసేన రాజ్యం...

దేవసేన రాజ్యం...


ప్రభాస్‌, అనుష్క, సత్యరాజ్‌పై దేవసేన రాజ్యానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఫిలింసిటీలో జరుగుతోంది.

బాహుబలి భార్యగా

బాహుబలి భార్యగా

అనుష్క...బాహుబలి భార్యగా తనదైన శైలిలో సాహసాలు చేస్తుందని తెలుస్తోంది.

అనుష్క కోసం పోరాటం

అనుష్క కోసం పోరాటం

రానా, ప్రభాస్ ఇద్దరూ అనుష్క తమకు దక్కాలని ప్రయత్నిస్తారని చెప్తున్నారు.

ఫ్లాష్ బ్యాక్ లో

ఫ్లాష్ బ్యాక్ లో

దేవసేవ ..యువరాణిగా, మహారాణిగా వచ్చే సన్నివేశాలు అన్ని ఫ్లాష్ బ్యాక్ లో రానున్నాయి.

ఉత్కంఠ

ఉత్కంఠ

బాహుబలిగా ప్రభాస్,దేవసేనగా ఉండే అనుష్కను గెలుచుకునే సన్నివేశాలు చాలా ఉత్కంఠతో ఉంటాయంటున్నారు.

హైలెట్

హైలెట్


సెకండ్ పార్ట్ కు పూర్తిగా దేవసేన పాత్ర హైలెట్ అవుతుందని, ఆమెపై చిత్రీకరించే ఓ ఫైట్ సీన్ అదిరిపోతుందని చెప్తున్నారు.

కారణం

కారణం

అనుష్కని రానా ..చెరబట్టడానికి కారణం ఈ ఎపిసోడ్ చివర్లో రివీల్ అవుతుందంటున్నారు.

కొడుక్కు ..

కొడుక్కు ..

కొడుకైన శివుడుకు ...తల్లి దేవసేన...ఈ ఫ్లాష్ భ్యాక్ ని చెప్తుందని, అసలేం జరుగుతుందో వివరిస్తుందని అంటున్నారు.

కథ విన్నాక

కథ విన్నాక

తల్లి నుంచి అసలేం జరిగిందే విన్న శివుడు..అసలు తను ఎవరో తెలుసుకుని, చేసే పోరాటమే కంక్లూజన్ అంటున్నారు.

భారీ యుద్దం

భారీ యుద్దం

బాహుబలి చేసే యద్దాలు మాత్రమే కాక, శివుడుకు, రానా కు మధ్య పెద్ద వార్ జరుగుతుందని చెప్తున్నారు. అదే పెద్ద ఎపిసోడ్ .

తమన్నాతో ప్రణయం

తమన్నాతో ప్రణయం

తమన్నా పాత్ర ..దేవసేను ను కలవటం, దేవసేన కుమారుడే శివుడు అని తమన్నా తెలుసుకోవటం, ప్రణయం కు చెందిన ఎపిసోడ్స్ ఉంటాయి.

కట్టప్ప కీలకం

కట్టప్ప కీలకం

కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాల్సి వచ్చిందో ఈ ఎపిసోడ్ లో హైలెట్ కానుంది.

మరింత భారీగా

మరింత భారీగా

తొలి భాగం సాధించిన విజయం స్పూర్తితో రాజమౌళి..రెండో భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించటానికి ప్రయత్నిస్తున్నారు.

English summary
Bahubali proved that Anushka will make happy her fans with her role and entire industry mesmerized with her performance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu