అనుష్క ఒంట్లో కొవ్వు తగ్గించుకోవటానకి యోగా వదిలి ఆ మార్గాన్నే ఎన్నుకుందా?
హాట్ స్టార్ అనుష్క తన బాడీలో ఉన్న కొవ్వుని బాగా తగ్గించుకోవాలని నిర్ణయించుకుందని అందుకోసం లైపోసెక్షన్ చేయించుకోనుందని చెప్తున్నారు. యోగా మాస్టరైన అనుష్క ఇన్నాళ్ళుగా తన శరీరాన్ని యోగా తో అదుపులో పెట్టుకుంటూ వచ్చింది. అయితే కంటిన్యూ షెడ్యూల్స్ తో ఆమెకు యోగా చెయ్యలేకపోవటంతో నడుము వద్ద ముడతలు బాగా కనపడుతున్నాయని,ముఖ్యంగా తమిళంలో రీసెంట్ గా చేసిన వేదం రీమేక్ లో అవి బాగా ఎక్సపోజ్ అయ్యాయని అందుకే ఆ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. దాంతో ఆమె గతంలో లాగ చక్కటి షేప్ తో త్వరలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. లైపో అనంతరం రెగ్యులర్ గా యోగా చేస్తూ...స్ట్రిక్ట్ డైట్ తో శరీరాన్ని మెయింటైన్ చేయాలనుకుంటోందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. తమిళంలోనూ, హిందిలోనూ అవకాశాలు వస్తున్న ఈ సమయంలో శరీరం అదుపు తప్పితే నమితకు పట్టిన గతే తనకూ పడుతుందని ఆమె భయపడుతోందిట. అందులోనూ రోజు రోజుకూ వస్తున్న కుర్ర హీరోయిన్స్ తో ఆమె కు వస్తున్న పోటీ కూడా ఆమెను ఈ దిశగా అడుగులు వేయించేటట్లు చేస్తోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











