అనుష్క కోసం గోపీచంద్, నాగార్జున పోటీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో తాను 'రామాయణం" సినిమాను తెరకెక్కిస్తానని, తన స్టయిల్ లో రామాయణం సినిమాను తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాక రావణుడు పాత్ర తరహాలో సాగే క్యారెక్టర్ కి నాగార్జునని సైతం ఎంపిక చేసారు. అయితే సీతా, రాముడుగా కీ రోల్ లో ఎవరు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో అనుష్క, గోపీచంద్ పేర్లు బయిటకు వచ్చాయి. వీరిది హిట్ పెయిర్ కావటం ఓ కారణం,అంతేగాక అనుష్కలో హుందాతనం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని చెప్తున్నారు. ఆమె కోసం గోపీచంద్, నాగార్జున పోటీపడటం సినిమాలో హైలెట్ అవుతుందని వర్మ భావించాడని వినిపిస్తోంది. అందులోనూ ప్రస్తుతం అనుష్క వరసగా నాగార్జున సినిమాల్లో చేస్తోంది. అంతకుముందు గోపీచంద్ తో పెళ్లి జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ సినిమాకు కాంట్రావర్సి తెచ్చి ఓపినింగ్స్ తెస్తాయని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.
తన రామయాణం సినిమా త్రేతా యుగం నాటిది కాదు, ఈ కాలం నాటిదే అని వర్మ చెప్పుకొచ్చారు. తన సినిమా స్టోరీలైన్ గురించి చెబుతూ....అయోధ్య గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్, లంక్ గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీకు మధ్య జరిగే బిజినెస్ వారే తన సినిమా ప్రధాన కథాంశమని వర్మ చెప్పారు.అయోధ్య గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి ధశరథ్ రావు, ఆయన భార్య కౌసల్య. వీరి కొడుకు రాంశంకర్. దశరథ్‌కు ముంబైలో కైకేయి పరిచయం అవుతుంది. ఆమెను పెళ్లి చేసుకుని భరత్ కుమార్ అనే బిడ్డను కంటాడు. కంపెనీ ఎండీ బాధ్యతలు భరత్ కుమార్ కే అప్పగిస్తానని కైకేయికి మాటిస్తాడు. కానీ అన్నను కానదని తనకు ఎండీ బాధ్యతలు అప్పగించడం భరత్‌కు ఇష్టం ఉండదు. తండ్రి మాట మేరకు రామ్ శంకర్, లక్ష్మణ్ నాసిక్ బ్రాంచి పనులు చూసుకుంటారు. అక్కడ లంక గ్రూప్ ఆఫ్ కంపెనీ వీరితో పోటీకి వస్తుంది, మిగిలిన కథాంశం తన సినిమా విడుదలైన తర్వాత చూసి తెలుసుకోవాలని ట్విస్ట్ ఇచ్చాడు వర్మ.


Click it and Unblock the Notifications











