Just In
- 2 min ago
‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
- 35 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 54 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
Don't Miss!
- News
అర్నబ్‌తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Automobiles
సరికొత్త జావా ఫోర్టీ టూ మోడల్ వస్తోంది.. స్పై చిత్రాలు, వివరాలు
- Sports
మ్యాచ్‌కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరు కొరటాల మూవీలో ఆ హీరోయిన్.. టెన్షన్ పడుతున్న మెగా ఫ్యాన్స్
సైరా లాంటి చారిత్రక నేపథ్యమున్న చిత్రంలో నటించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తదుపరి ఓ సామాజిక దృక్ఫథమున్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ఎదురున్నది లేని డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ కథను మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మలిచాడని టాక్. ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించగా.. తాజాగా ఓ అప్‌డేట్ వచ్చేసింది.

కొరటాల చిత్రంలో ఇద్దరు..
మామూలుగా కొరటాల శివ చిత్రంలో సాధారణంగా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మిర్చి చిత్రంలో అనుష్క, రిచా ఉండగా..జనతా గ్యారెజ్‌లో సమంత, నిత్యా మీనన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మహేష్ బాబుతో చేసిన సినిమాలకు మాత్రం మినహాయింపును వర్తించారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రంలో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుంది.

చిరు సినిమాలోనూ ఇద్దరు..
చిరంజీవితో తెరకెక్కించబోయే సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్ వినిపిస్తోంది. అయితే ఓ హీరోయిన్‌గా త్రిషను ఫిక్స్ చేసేశారు. అయితే మరో హీరోయిన్‌కు కూడా స్కోప్ ఉందట. అందుకే ఇంకో స్టార్ హీరోయిన్ కోసం వేట ప్రారంభించారని తెలుస్తోంది.

అనుష్కకు చాన్స్..
చిరుతో ఇప్పటికే రెండు సార్లు జోడికట్టింది అనుష్క. స్టాలిన్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయగా.. సైరా చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించింది. అయితే ఈ రెండు సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. మరోసారి చిరుకు జోడిగా అనుష్క నటించబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి.

ఆందోళనలో ఫ్యాన్స్..
అయితే చిరంజీవి సినిమాలో అనుష్క కనబడితే ఫలితం తిరగబడుతోందని మెగా ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. మరోవైపు కొరటాల తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ మిర్చిలో అనుష్కనే నటించింది. మరి ఎవరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో చూడాలి.