ఆమె చేస్తే చూశారు !? మరి నేను చేస్తే తప్పేంటి..!?
అప్పుడప్పుడూ కాస్త రిలీఫ్ కోసం ఐటెమ్ సాంగ్ లు చేస్తే తప్పేముంది ఎప్పుడూ ఒకే రకంగా కనిపిస్తుంటే ప్రక్షకులకు బోర్ కొడుతుంది. వాళ్లు కూడా డిఫెరెంట్ ను కోరుకుంటారని గడుసుగా చెపుతోంది అనుష్క. ఆ మధ్య స్టాలిన్ లోనూ, మొన్న ఈ మద్య 'కేడీ" లోనూ ఐటెమ్ సాంగ్ తో అనుష్క అలరించింది. 'ఎప్పుడూ రొటీన్ గా హీరోయిన్ పాత్రలనే చేస్తుంటాను. అటు కమర్షియల్ చిత్రాలు, ఇటు నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఈ మధ్య చేస్తున్నాను. మద్య మద్యలో ఐటమ్ సాంగ్స్ చేస్తున్నాను. అందుకే అరుంధతి తర్వాత వేదంలో పాత్రకు ప్రాదాన్యత ఉన్నది కాభట్టే అమలాపురం సరోజగా చేశాను అంటోంది.
అయినా ఇప్పుడు హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్ చేయడం మామూలైపోయింది. ఐశ్వర్యా రాయ్ 'కజురారే.." అంటూ ఆడి పాడితే జనాలు చూశారు కాదా? మరి నేను చేస్తే తప్పేంటి? అని అడుగుతోంది అందాల అనుష్క. దీపముండగానే..అన్నట్టు గ్రామర్ ఉండగానే డబ్బు సంపాదించాలని చూస్తున్న ఈ సొగసు సుందరి అడుగుజాడల్లోనే నడవాలని చూస్తోంది శ్రియ. ఈ విషయం దర్శక నిర్మాతలు గుర్తుంచుకొంటే ఇలాంటి హీరోయిన్స్ కి మరికొన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











