అనుష్కను గర్భవతిని చేయనున్న దర్శకుడు?
హైదరాబాద్: ఆ దర్శకుడి మూలంగా హాట్ హీరోయిన్ అనుష్క గర్భవతి కానుంది? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు లెండి.... కేవలం రీల్ లైఫ్ లోనే. అసలు వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో విద్యా బాలన్ నటించిన 'కహానీ' చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈచిత్రంలో విద్యా బాలన్ గర్భవతిగా నటించింది.
తాజాగా ఇదే చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల అనుష్కను హీరోయిన్ గా పెట్టి తెలుగులో రీమేక్ చేయనున్నాడట. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అదే నిజమైతే హాట్ హీరోయిన్ అనుష్క వెండి తెరపై గర్భం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.
సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా చేయడానికి నిర్మాతలు తహతహలాడుతున్నారు.
ప్రస్తుతం అనుష్క చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నాగార్జునతో నటించిన 'డమరుకం' చిత్రం త్రవలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'మిర్చి', కార్తితో 'అలెక్స్ పాండ్యన్', ఆర్య హీరోగా రూపొందుతున్న ఇరండం ఉలగమ్, అదే విధంగా శౌర్యం, దరువు చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











