అనుష్కని ఈజీగా పడేయ్యాలంటే అదే టెక్నిక్...
అరుంధతి తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన అనుష్కని ఈజీగా పడేయటానికి టెక్నిక్స్ ఉన్నాయంటున్నారు సీనియర్ సినిమా జనాలు. వాళ్ళు చెప్పుకునే దాని ప్రకారం..అనుష్కని కలవగానే ముందుగా కుశలప్రశ్నలు అయ్యాక ఆమెకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు యోగా గురించి ఎత్తాలట.అప్పుడు ఆమె వెంటనే వచ్చిన వారిని చక్కగా రిసీవ్ చేసుకుని యోగ క్షేమాలు కనుక్కుని యోగా గురించి తీరిగ్గా ఓ లెక్చర్ ఇస్తుందిట. మనకి ఇంకా ఓపికుంటే తన గురువు భరత్ ఠాకూర్ క్లాసులుకు వెళ్ళమని రికెమండ్ చేసి ఫోన్ చేసి మరీ అపాయంట్ మెంట్ ఇప్పిస్తుందిట. ఆ తర్వాత మనం వచ్చిన విషయం చాలా ఈజీగా మాట్లాడయవచ్చు అంటున్నారు. రీసెంట్ గా ఆమె డేట్స్ పట్టుకున్న నిర్మాత ఈ టెక్నిక్ నే వాడి విజయం సాధించాడని చెప్తున్నారు. అలాగే యోగా గురించి చెప్పేటప్పుడు ఈ మాజీ యోగా టీచర్ ఓ ట్రాన్స్ లోకి వెళ్లినంతలా లీనమై చెప్తుందిట. అలాంటి సమయంలోనే ఆమెను ప్రసన్నం చేసుకోవాలిట. అయితే ఓ రెండు రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి యోగా క్లాస్ కి వెళ్లారా లేదా అని ఎంక్వైరీ చేస్తుందిట. లేదా నెక్ట్స్ మీటింగ్ కాన్సిల్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందిట. అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications











