»   » ఆమెతో తలపడేందుకు మరింత ఎక్స్ పోజింగ్ చేసింది...!?

ఆమెతో తలపడేందుకు మరింత ఎక్స్ పోజింగ్ చేసింది...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కింగ్ నాగార్జున హీరోగా కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై అగ్రనిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి, యువ దర్శకుడు వీరు పొట్ల దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం 'రగడ' డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క, ప్రియమణి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆడియోకు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. అన్ని పాటలూ చాలా బాగున్నాయని ప్రతి ఏరియా నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క పక్కన సైడ్ క్యారెక్టర్ వేయాల్సి రావడమంటే ఎంతటి అందగత్తెకయినా సవాలే. ఎవరినైనా తలదన్నేంత అందగత్తె అనిపించే అనుష్కతో పోటీ పడాలంటే ఎవ్వరికైనా సమస్యే. అందుకే అనుష్క పక్కన ఆనాలని ప్రియమణి 'రగడ" సినిమాలో ఆమె కంటే ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసింది. చివరకు ఆడియో ఫంక్షన్ కి కూడా అనుష్కని మరిపించాలని మేకప్ ఎక్కువేసుకుని వచ్చింది. అయితే అస్సలు మేకప్ అన్నదే వేసుకోకుండా సింపుల్ గా వచ్చిన జేజెమ్మ ముందు 'అష్టలక్ష్మి" వెలవెలబోయింది. 'రగడ" సినామలో అష్టలక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్న ప్రియమణి ఆ చిత్రం ఆడియో వేడుకకి ఎక్స్ ట్రా మేకప్ వేసుకుని వచ్చినువ్వుల పాలయింది. అనుష్కని మరిపించాలని చూసి డ్రామా ఆర్టిస్టూలా ఓవర్ మేకప్ వేసుకుని దిగిపోయింది. అయితే అనుష్కని పక్కన పెడితే ప్రియమణి కూడా అందగత్తేనని, ఆమె ఇలాంటి హంగులు, రంగులు లేకుండా వస్తే తప్పకుండా తన మార్కులు తనకు పడి ఉండేవని, ఇలా కామెడీ అయి ఉండేది కాదని ఫంక్షన్ కి వచ్చిన వాళ్లు గుసగుసలాడుకున్నారు.

Please Wait while comments are loading...