»   » ఆ వీడియో చూడటమే పెద్ద తప్పు, చూసి మళ్లీ అనుష్కపై అసహ్యకరమైన కామెంట్స్, పద్దతేనా

ఆ వీడియో చూడటమే పెద్ద తప్పు, చూసి మళ్లీ అనుష్కపై అసహ్యకరమైన కామెంట్స్, పద్దతేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. నెట్‌లో బాహుబలి-2 వార్ సీన్లు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత , వాటిని నెట్‌లో పెట్టిన వ్యక్తిని విజయవాడలో అరెస్ట్ చేసారు. ఇది అంతా కొన్ని గంటల్లోనే జరిగి పోయింది. అయితే.. అసలు ట్విస్ట్ అక్కడే పడింది.

బాహుబలిలో ఆ సీన్స్ లీకైన కొద్ది గంటల్లోనే చాలా మంది చూసేసారు. చూసినోళ్లు అక్కడితో ఆగారా అంటే..ఆవేశంగా ట్విట్టర్ లో కామెంట్స్ చేయటం మొదలెట్టారు. బాగుంది..అద్బుతం అంటే ఓకే అనుకుందుము కానీ... దేవసేనగా నటిస్తున్న అనుష్కపై నెగెటివ్ కామెంట్స్ చేయటం పెరిగిపోయింది. ఆ క్లిప్ లో ప్రభాస్, అనుష్క మధ్య సన్నివేశాలు ఉన్నాయట.


Also See : బాహుబలి-2 సీన్లు లీక్..... నిర్మాత ఫిర్యాదు, ఒకరి అరెస్ట్!


ఇక ఆ సీన్లను ఎంతమంది చూశారో, అసలేం చూసారో తెలియకపోయినా.. చూసిన కొద్ది మంది మాత్రం ఆమెపై తీవ్రమైన పదజాలంతో సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.


ఆ సెటైర్స్ లో... అనుష్క నాభి ప్రాంతాన్ని ఆర్టీసీ బస్సుతో పోల్చారు. అంతేకాదు.. ఆమె ఎన్ని యోగాసనాలు వేసినా శరీరంలో పెద్ద తేడా ఏమీ కనిపించలేదని, ప్రభాస్ పక్కన అనుష్క చాలా లావుగా కనిపించిందంటూ విమర్శలు గుప్పించారు. దాంతో అనుష్క అభిమానులు హర్ట్ అవటమే కాదు... ఈ విషయాలన్నీ రాజమౌళి వరకూ వెళ్లాయట.


ఇక .. బాహుబలి వీడియోల లీకేజీ వల్ల పెద్ద దెబ్బే తగిలిందని మధన పడుతున్నాడంటూ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ కామెంట్లన్నీ బయ్యర్ల చెవిన పడితే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాడటంటున్నారు. నిజమే కదా. మన నోటి దూలతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టే కామెంట్స్ తో ఇలాంటి సమస్యలు వస్తాయి మరి.


మొన్నామధ్య పీవిపి బ్యానర్ లో ఆర్య సరసన చేసిన సైజ్ జీరో కోసం లావైన బ్యూటి దానిని క‌రిగించుకేనే ప‌నిలో ఉంద‌ట‌. రాజ‌మౌళి ప్ర‌తి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి 2 లో దేవ‌సేన పాత్ర‌లో అనుష్క క‌నిపించాలి. దేవ‌సేన పాత్ర కోసం అనుష్క ఉన్న‌ఫ‌లంగా ప‌ది కేజీలైనా త‌గ్గాల‌ని అన్నాడ‌ట రాజ‌మౌళి. ఇటీవల ఫిలిమ్ ఫేర్ అవార్డ్ వేడుకలో అనుష్కను చూసివారందరూ కంగారుపడ్డారు. అనుష్క రీసెంట్ ఫొటోలు మీకు ఇక్కడ కొన్ని అందిస్తున్నా చూడండి.


ఎదురుచూస్తున్నారు

ఎదురుచూస్తున్నారు

మెగాస్టార్ చిరంజ‌వి 150వ సినిమా ‘క‌త్తీ' రీమేక్ లో న‌టించే అవ‌కాశం కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు.


అనుష్క ఫైనల్ అన్నారు

అనుష్క ఫైనల్ అన్నారు

ఈ సినిమా కోసం న‌య‌న‌తార‌, అనుష్క పేర్లు ప్ర‌ధానంగా వినిపించాయి. అనుష్క ఫైన‌ల్ అంటూ కొన్ని వార్త‌లు సైతం ఫిల్మ్ న‌గ‌ర్ లో ప్ర‌చారం చేశాయి. కానీ వద్దనుకున్నారు


ఇదేనా కారణం

ఇదేనా కారణం

అయితే అనుష్కకు తీసుకోకపోవ‌డానికి ఓ ప్ర‌ధాన కార‌ణం ఉంటదంటూ ఇప్పుడు ఓ వార్త ప్ర‌చారంలో ఉంది. లావు త‌గ్గ‌క పోవ‌డంతోనే ఈ సినిమాలో అనుష్క న‌టించే అవ‌కాశం కోల్పోయింద‌ట‌.


రాజమౌళి సైతం

రాజమౌళి సైతం

లావు తగ్గకపోతే తన సినిమాలో కంటిన్యుటి ఇబ్బంది అవుతుందని రాజమౌళి స్పష్టంగా చెప్పారట.


లైపో

లైపో

ఇప్పుడు ఉన్నపళంగా లావు తగ్గాలంటే "లైపో" ఒక్కటే గతి మ‌న అరుంధ‌తికి.


కానీ...

కానీ...

అనుష్కకు అలా లైపోలు, ఆపరేషన్స్ తో తగ్గ‌డం ఏమాత్రం ఇష్టం లేదు.


యోగాతో పాటు

యోగాతో పాటు

అందుకే యోగాతోపాటు ఎక్సర్ సైజులు చేస్తోంద‌ట‌. జిమ్ లో చెమట ఓడుస్తోందిట


కానీ ఆప్షన్ లేదు

కానీ ఆప్షన్ లేదు

రాజ‌మౌళికు మొదట పార్ట్ లో ఆమే ఉండటంతో సెకండ్ పార్ట్ లో ఆమెను తప్ప వేరే వారిని తీసుకునే ఆప్షన్ లేదు


లో మెటబాలిజం

లో మెటబాలిజం

అనుష్క లో మెటబాలిజం ఇష్యూలతో ఇబ్బంది పడుతోందంటున్నారు.


రాజమౌళికే వర్రీ

రాజమౌళికే వర్రీ

అనుష్క ఇలా కనపడటం రాజమౌళిని చాలా ఇబ్బంది పడేసిందంటున్నారు.


వారియర్ క్వీన్

వారియర్ క్వీన్

బాహుబలి 2 లో వారియర్ క్వీన్ గా కనపడాలి. అలాంటి ఆమె ఇలా ఉంటే ఎలా అంటున్నాడట


జోరో కోసం

జోరో కోసం

‘సైజ్ జీరో' చిత్రం కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగటమే ఈ సమస్యకు కారణం అంటున్నారు.


ఊబకాయం

ఊబకాయం

ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ ప్రయోగాత్మక చిత్రం అనుష్క ఊబకాయం ఉన్న యువతిగా కనిపించింది.


ఉత్సాహంగా

ఉత్సాహంగా

అప్పట్లో తాను లావు పెరగడం ఎలా అన్నది ఆమె తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వీడియోని షేర్ చేశారు.


ఇష్టమొచ్చిన

ఇష్టమొచ్చిన

ఈ వీడియో చూస్తే.. లావు పెరగడం కోసం అనుష్క ఇష్టం వచ్చిన తిండి తింది అనిపిస్తోంది.


కలిసి రాలేదు

కలిసి రాలేదు

ఇంత కష్టపడి ఒళ్లు పెంచి చేసిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.


బాగమతి

బాగమతి

అనుష్క కొత్తగా భాగమతి అనే చిత్రం మాత్రమే కమిటైంది.


బాలయ్యతోనూ

బాలయ్యతోనూ

మొదట బాలయ్య ప్రక్కన గౌతమి పుత్రశాతకర్ణి చిత్రానికి అనుకున్నారు కానీ తర్వాత వద్దనుకున్నారు.


రెమ్యునేషన్ అన్నారు.

రెమ్యునేషన్ అన్నారు.

అయితే అనుష్క రెమ్యునేషన్ ఎక్కువ చెప్పటమే సినిమాలు ఓకే కాకపోవటానికి కారణం అన్నారు.


మెడికేషన్

మెడికేషన్

లో మెటబాలిజం సమస్య తగ్గటం కోసం ఆమె ప్రస్తుతం మందులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


English summary
Baahubali 2 film has hit the headlines after one of its crew members stole an unedited video footage of a battle sequence and shared with his friends, which has now gone viral on the internet.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu