»   » అల్లు అర్జున్ సినిమాలో అనుష్క ఐటం సాంగ్?

అల్లు అర్జున్ సినిమాలో అనుష్క ఐటం సాంగ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అనుష్క గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. త్వరలో రాబోతున్న అల్లు అర్జున్ మూవీ ‘సరైనోడు'లో అనుష్క ఐటం సాంగ్ చేయబోతోందట. తన ‘రుద్రమదేవి' సినిమాలో బన్నీ నటించి సినిమాకు హెల్ప్ చేసాడు. ఇది ఒక కారణం కాగా...రుద్రమదేవి షూటింగ్ సయమంలో బన్నీతో ఏర్పడ్డ మంచి ఫ్రెండ్షిప్ కూడా ఆమె ఈ ఐటం సాంగ్ ఒప్పుకోవడానికి మరో కారణమని అంటున్నారు. అనుష్క ఐటం సాంగ్ చేయడం సినిమాకు బాగా ప్లస్సవుతుందని టాక్.

‘సరైనోడు' సినిమా గురించిన వివరాల్లోకి వెళితే...
అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

Anushka item song in Allu Arjun's Sarainodu

బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వినిపిస్తున్నప్పటికి... కార్యరూపం దాల్చటానికి టైమ్ పట్టింది.. తొలిసారి బన్నీ, బోయపాటి కాంబినేషన్ ఫ్యాన్స్ కి కిక్కివ్వబోతోంది... ఫస్ట్ టైమ్ వీరిద్దరి కలయికలో వస్తున్నఈ ప్రాజెక్ట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి.... ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ టైమ్ జతకట్టింది... గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

English summary
Film Nagar buzz is that heroine Anushka would sizzle in a special song in Allu Arjun's upcoming film "Sarainodu".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu