»   » అనుష్క కిల్లింగ్ లుక్స్: ప్రభాస్ మీద మనసు పడిందా? వీడియో వైరల్!

అనుష్క కిల్లింగ్ లుక్స్: ప్రభాస్ మీద మనసు పడిందా? వీడియో వైరల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి ప్రాజెక్టులో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క ప్రేమలో పడ్డారని, త్వరలో వీరు పెళ్లాడబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి మధ్య ఉన్న ఎఫెక్షన్ ను ఫోకస్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది.

ప్రభాస్, అనుష్క ఇద్దరూ పెళ్లికి దూరంగా ఉండటానికి కారణం....... ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటమే, అందుకే ఇద్దరూ ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు, త్వరలోనే వీరి నుండి అభిమానులకు శుభవార్త అందనుంది అనే ప్రచారం జరుగుతోంది.

అక్కడే ప్రేమ ముదిరింది

అక్కడే ప్రేమ ముదిరింది

బాహుబలి సినిమా కోసం ఏళ్ల తరబడి కలిసి పనిచేసారు ప్రభాస్, అనుష్క. ఈ క్రమంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు బాగా అర్థం చేసుకున్నారని, ఈ క్రమంలోనే ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారని.... బాహుబలి సినిమా షూటింగ్ ముగిసే సమయానికి ఇద్దరి ప్రేమ వ్యవహారం మరింత ముదిరిందని టాక్.

అతి త్వరలోనే

అతి త్వరలోనే

ప్రభాస్ వయసు 40కి చేరువవుతుండటంతో ఇంట్లో నుండి కూడా పెళ్లి గురించి ఒత్తిడి పెరిగింది. ఇంకా కొంతకాలం వారు డేటింగ్ చేద్దామని అనుకున్నప్పటికీ వాళ్ల ఒత్తిడితో త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు టాక్.

రాజమౌళి రికమండేషన్

రాజమౌళి రికమండేషన్

బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ తో పాటు వారి ఫ్యామిలీకి కూడా అనుష్క దగ్గరైంది. అనుష్క చాలా మంచి అమ్మాయి అని రాజమౌళి ఫ్యామిలీ రికమండేషన్ కూడా ఉండటంతో వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

అనుష్క

అనుష్క

అనుష్క కూడా ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఆమె వయసు కూడా 35కి చేరువైంది. ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టే అనుష్క తన పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిందని అంటున్నారు.

అంతా రహస్యం

అంతా రహస్యం

తమ ప్రేమ విషయం ఇన్నాళ్లు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటంలో ప్రభాస్, అనుష్క సక్సెస్ అయ్యారు. ఇన్నాళ్లు వారు పూర్తి క్లోజ్డ్ గా బాహుబలి సెట్స్ లో నే ఉంటూ వచ్చారు కాబట్టి అది సాధ్యమైంది.

ఫ్యాన్స్

ఫ్యాన్స్

ప్రభాస్, అనుష్క వివాహం జరిగితే అభిమానులు కూడా హ్యాపీ. ఇద్దరి ఈడు జోడు బాగా కుదురుతుందని, ఈ జంట సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ చూడ ముచ్చటగా ఉంటారని అంటున్నారు.

అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది

అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది

అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. ప్రభాస్ నుండిగానీ, అనుష్క నుండి గానీ ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

English summary
Pranushka....The way Anushka looking at PRABHAS Killing Looks. Baahubali star Prabhas is giving sleepless nights to many girls ever since the news of his marriage has gone viral. It was reported that Prabhas will get married once he finishes the shooting of Baahubali franchise. And when everyone is waiting for the big news, rumours of his closeness with Anushka Shetty aka Devsena of Baahubali is doing the rounds.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu