'వేదం' చిత్రంతో అనుష్క బాగా నష్టపోయిందా?
అమలాపురం సరోజగా 'వేదం' చిత్రంలో చేసిన అనుష్క డబ్బులు పరంగా చాలా లాసయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. వారు చెప్పుకునేదాని ప్రకారం అనుష్క డేట్స్ ని వేదం నిర్మాతలు నలభై రోజులు అడిగారు. దానికి అనుష్క ఓకే చెప్పి తన రెమ్యునేషన్ చిత్రానికి కోటి ఇరవై లక్షలని చెప్పింది. దానికి నిర్మాతలు అంత బేర్ చేయలేమని నలభై లక్షలు ఇస్తామని అన్నారు. అయితే అనుష్క దానకి ఒప్పుకోలేదు. బేరసారాలు జరిగాక నిర్మాతలు ఆమె చెప్పిన రేటుకే ఒప్పుకుని అయితే ఏ రోజుకి ఆ రోజు చొప్పున డేట్స్ ని బట్టి ఇస్తామన్నారు. సరేనన్న అనుష్క తనకు ఏ విధంగానయితే కోటి ఇరవై లక్షలు ముట్టడం ముఖ్యమనుకుంది. కానీ నిర్మాతలు..దర్శకుడు క్రిష్ తో కలిసి డేట్స్ కరెక్ట్ గా ప్లాన్ చేసి కేవలం పందొమ్మిది రోజుల్లో ఆమె పాత్రను ఫినిష్ చేసారు. దాంతో ఆమెకు 57 లక్షలు మాత్రమే ముట్టింది. ఆశించిన మిగతా సొమ్ము గురించి మాట్లాడటానికి కూడా లేకుండా పోయింది. అయితే ఈ చిత్రంతో వచ్చిన పేరు పోగొట్టుకున్న సొమ్ముతో పోలిస్తే చాలా ఎక్కవ కాబట్టి హ్యాపీ అని తన సన్నిహితులతో చెప్తోందిట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











