అనుష్క పెళ్లి ప్రయత్నాలు.. సినిమాలకు ఇక దూరమేనా!
Recommended Video

స్టార్ హీరోయిన్ అనుష్కకి సంబందించిన వార్తలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బాహుబలి తరువాత అనుష్క కేవలం ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. అది కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రం భాగమతి. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత అనుష్క మరో చిత్రంలో కనిపించలేదు. మరో సినిమాకు కూడా ఆమె అంగీకారం తెలపలేదు. దీనితో అనుష్క గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.

క్రేజీ హీరోయిన్‌గా
అన్ని రకాల పాత్రలకు సూటయ్యే అతికొద్దిమంది సౌత్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. గ్లామర్ పత్రాలు, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పాత్రలు, లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ఇలా అన్ని విధాలుగా అనుష్క భాగమతి చిత్రం వరకు దూసుకుపోయింది. సాహసోపేతమైన పాత్ర ఉంటే ముందుగా దర్శక నిర్మాతలకు అనుష్క గుర్తుకు వచ్చేది. అంతలా సౌత్ లో అనుష్క ప్రభావం కొనసాగింది.

సినిమాలకు దూరం
తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అనుష్క సినిమాలకు దూరం కాబోతోందా అనే ఊహాగానాలు అధికం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అనుష్క సినిమాలకు దూరం కాబోతోందంటూ వార్తలు అధికం అవుతున్నాయి.

పెళ్లి కబురు
ఇటీవల అనుష్క దోష నివారణార్థం అనేక పూజలు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క వయసు 36 ఏళ్ళు. ఆమె కుటుంబ సభ్యులు అనుష్కకు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ రెండు ఏమైనట్లు
ఆ మధ్యన అనుష్క భాగమతి చిత్రం తరువాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్రం గురించి ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగడంలేదు. మాధవన్ సరసన ఓ చిత్రంలో నటించబోతోందంటూ వార్తలు వినిపించాయి. ఈ రెండు చిత్రాలకు సంబందించిన ఊసే ఎక్కడా వినిపించడం లేదు.


Click it and Unblock the Notifications











