»   »  షాకింగ్ న్యూస్: టాలీవుడ్ నిర్మాతతో హీరోయిన్ అనుష్క వివాహం?

షాకింగ్ న్యూస్: టాలీవుడ్ నిర్మాతతో హీరోయిన్ అనుష్క వివాహం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క.... టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. మరి అలాంటి స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఏ వార్త అయినా ఆసక్తికరమే. ముఖ్యంగా వీరి ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వార్తలు లాంటివి తెలుసుకోవడానికి అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

చాలా ఏళ్ల కిందట ఓ ప్రముఖ పత్రికలో నాగచైతన్యతో అనుష్క పెళ్లి అంటూ క్వశ్చన్ మార్కుతో ఓ వార్త ప్రచురితమైంది... అది వాస్తవం కాక పోయినా ప్రముఖ పత్రిక రాయడంతో పెద్ద న్యూస్ అయింది. తర్వాతి కాలంలో అనుష్క గురించి రకరకాల వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి.

కొన్ని సందర్భాల్లో అనుష్కపై రకరకాల పుకార్లు వినిపించాయి. అనుష్క ఆ హీరోతో ఎఫైర్ నడుపుతోందని, పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందనే ప్రచారాలు బోలెడు జరిగాయి. మీడియాకు ఆమె ఎదురు పడ్డప్పుడల్లా ఇలాంటి ప్రశ్నలే ఎదురవ్వడం మొదలయ్యాయి.

తప్పించుకోను. అలాగే రహస్య వివాహం చేసుకోను

తప్పించుకోను. అలాగే రహస్య వివాహం చేసుకోను

గతంలో ఈ సారి ఇలాంటి ప్రశ్నే ఎదురైతే... అనుష్క తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. ‘‘నా పెళ్లి గురించి మీడియా రకరకాలుగా ప్రచారం చేస్తోంది. నా పెళ్లి అనేది వ్యక్తిగతం అని చెప్పి తప్పించుకోను. అలాగే రహస్య వివాహం చేసుకోను. అందరికీ చెప్పే చేసుకుంటా. అది ప్రేమ వివాహం కావచ్చు, పెద్దలు నిశ్చయించిన పెళ్లి కావచ్చు'' అంటూ క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేసింది అనుష్క.

బాహుహుబలి పూర్తయ్యాక

బాహుహుబలి పూర్తయ్యాక

ప్రస్తుతం అనుష్క బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్టులో నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ఆమె పెళ్లి ఆలోచన చేసే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ దగ్గర పడ్డ నేపథ్యంలో మళ్లీ ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అనుష్క వయసు ఇపుడు 34 సంవత్సరాలు.

నిర్మాతను పెళ్లాడబోతోందా?

నిర్మాతను పెళ్లాడబోతోందా?

అనుష్క టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతను వివాహం చేసుకోనుందని టాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఇందులో నిజం ఎంతో ఇంకా తేలాల్సి ఉంది.

వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా

వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా

వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, అనుష్కతో నిర్మాత అన్యోన్యంగా ఉంటున్న విషయం నిర్మాత కుటుంబ సభ్యులకు కూడా తెలుసని నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం.

అనుష్కతో పలు సినిమాలు నిర్మించిన వ్యక్తే..?

అనుష్కతో పలు సినిమాలు నిర్మించిన వ్యక్తే..?

అనుష్కతో ప్రేమలో ఉన్న ఆయన ఇఫ్పటికే అనుష్కతో పలు సినిమాలు కూడా నిర్మించారట. షాకింగ్ విషయం ఏమిటంటే ఆయనకు ఇప్పటికే ఓ సారి పెళ్లయిందని అంటున్నారు.

అనుష్క కుటుంబం

అనుష్క కుటుంబం

ఇప్పటికే పెళ్ళి అయిన ఆ నిర్మాతతో వివాహానికి అనుష్క కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ పెళ్ళికి అనుష్క, ఆ నిర్మాత మాత్రం పూర్తిగా రెడీ అయిపోయారని టాక్.

English summary
"Anushka is going to marry very soon,that too she was marrying tollywood big shot producer" this words has became sensation in tollywood. According to film reports both are moving very closely for from years and are planning for marriage very soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu