»   »  పెద్దలు కుదిర్చిన పెళ్లికే జేజెమ్మ గ్రీన్ సిగ్నల్

పెద్దలు కుదిర్చిన పెళ్లికే జేజెమ్మ గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జేజెమ్మగా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునే హీరోయిన్ అనుష్క పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చేతినిండా పనితో బిజీగా ఉన్న అనుష్కకు పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేనప్పటికీ తల్లిదండ్రులు మాత్రం వదిలిపెట్టలేదట. అనుష్క తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారని సమాచారం.

ఏలాగైనా ఓ అయ్యకు కట్టబెట్టి తమ బాధ్యతను తీర్చుకోవాలని భావించిన తల్లిదండ్రులు ఆమె పెళ్లి దిశగా పావులు కదిపినట్లు సమాచారం.
ఆ మధ్య బాహుబలి, రుద్రమదేవి సినిమాల తరువాత అనుష్క పెళ్లి చేసుకుంటుందని బలంగానే వినిపించింది. కానీ, ఆ సినిమాల షూటింగ్ పూర్తవుతూనే అనుష్క సైజ్ జీరో సినిమాకు డేట్లు కేటాయించేసి పెళ్లివార్తలకు చెక్ పెట్టేసింది.

Anushka to marry soon

అయితే, తాజా సమాచారం మేరకు అనుష్క పెళ్లికి ముహూర్తం ఖరారు అయినట్లే కనిపిస్తోంది. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి పచ్చజెండా ఊపేసిన బొమ్మాళీ ఈ ఏడాదే పెళ్లాడేందుకు కూడా అంగీకరించేసిందట.
వివాహం కోసం అమ్మడు దుబాయ్ లో షాపింగ్ కూడా చేసేసిందట.

అందుకే సైజ్ జీరో షూటింగ్ ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని యూనిట్ పై ఒత్తిడి తెస్తోందని అంటున్నారు. అనుష్క తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లే చేసుకుంటోందట.

English summary
Tollywood buz is that, Telugu film actress Anushka to marry soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu