ఆ తెలుగు దర్శకుడుతో అనూష్క వివాహం ?
రెండు మూడు సంవత్సరాలలో నేను వివాహం చేసుకుంటాను..ఇప్పటికే ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నానంటూ అనూష్క ఇటీవలే మీడియాతో చెప్పింది. దాంతో ఆమె ఎవరిని వివాహం చేసుకోవటానకి ఎంపిక చేసుకుంది అంటూ అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే పరిశ్రమలోని కొందరు మాత్రం ఆమె వేదం చిత్రం దర్శకుడు క్రిష్ తో ప్రేమలో పడిందంటూ గుసగుసలాడుతున్నారు. వేదం సమయంలో ఆమె..క్రిష్ తో బాగా ఇంటిమసిగా ఉండేదని, వాళ్ళిద్దరూ గంటలు తరబడి చర్చించుకోవటమే కాక తమిళంలో వేదం చేయటానకి క్రిష్ ని ప్రేరేపించింది కూడా ఆమె అంటున్నారు.
అలాగే క్రిష్ కూడా ఎక్కడికెళ్లినా అనూష్క టాపిక్ లేనిదే మాట్లాడటం లేదని, హైదరాబాద్ లో ఆమె ఉన్నప్పుడు కలవటమేకాక ఫోన్ లో కూడా ఆమె రోజూ అతనితో టచ్ లో ఉందని, కాబట్టి అతనే ...ఆమె ఎంపిక చేసుకున్న వ్యక్తి అయ్యుండవచ్చని అంటున్నారు. అనూష్క ప్రస్తుతం విక్రమ్ సరసన మదరాసుపట్టణం ఫేమ్ విజయ్ దర్శకత్వంలో నటిస్తోంది.అలాగే శింబు సరసన..తెలుగు చిత్రం వేదం రీమేక్ లో చేస్తోంది. వీటితో పాటు సూర్య తదుపరి చిత్రంలోనూ ఆమె పరిశీలనలో ఉంది. విజయ్ ,మాదవన్ లతో ఇప్పటికే ఆమె నటించింది. త్వరంలో ఆర్య సరసన లింగు స్వామి దర్శకత్వంలో వేట అనే చిత్రంలో చేయనుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో మహేష్ బాబు సరసన కూడా ఆమెనే తీసుకుంటున్నారు. ఇక కమల్ హాసన్ స్వంత చిత్రంలో కూడా ఆమెనే అడిగినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











