బిల్లా చిత్రంలో బికినీ వేసుకుని అదరకొట్టిన అనూష్క క్రేజ్ ని కొన్ని బ్యూటీ పార్లర్లు క్యాష్ చేసుకుంటున్నాయి. జూబ్లిహిల్స్ చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని బ్యూటీ పార్లర్లు తమ దగ్గర అనూష్క మసాజ్ దొరుకుతుందని ప్రచారం చేసుకుంటున్నాయి. అంటే అనూష్క వచ్చి మసాజ్ చేస్తుందని కాదు వారి భావం. తాము చేసే స్పెషల్ మసాజ్ తో అనూష్క బాడీలా ఫిట్ గా మారవచ్చునని వారి సారాంశం. ఆడవాళ్ళకు ప్రత్యకమైన ఈ మసాజ్ కాస్ట్ ఒక్కొక్క సిట్టింగ్ కి బాగానే వసూలు చేస్తున్నట్లు సమచారం. ఇక ఈ మసాజ్ వల్ల బాడీ గ్లో రావటమే కాక, స్లిమ్ గా అవుతారని, శరీర భాగాలు ఫిట్ గా మారుతాయని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రచారం బాగా ఫలించి ఈ పార్లర్లు ఊహించని విధంగా దాదాపు నెల పైగానే అడ్వాన్స్ బుకింగ్ లు అయిపోయాయి. బిల్లా కలెక్షన్స్ కన్నా ఈ పార్లర్ల కలెక్షన్లే బాగున్నయని కొందరు అంటున్నారు. ఇక మగవాళ్లకు కూడా ఇటువంటి మసాజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరి కొందరు కొంటెగా కామెంట్ చేస్తున్నారు.